శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (11:45 IST)

పిల్లన్ని కంటే వారికి భగవత్ తిండి పెడతారా : మాయావతి ప్రశ్న

హిందువులంతా ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని తద్వారా హిందూ జనాభా పెరిగేందుకు దోహదపడాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్‌ మోహన్‌ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ముఖ్యంగా బ

హిందువులంతా ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని తద్వారా హిందూ జనాభా పెరిగేందుకు దోహదపడాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్‌ మోహన్‌ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారమే చెలరేగింది. ముఖ్యంగా బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 
 
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని ఆగ్రాలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రారంభించారు. 'హిందూ జనాభా పెరగడం కోసం ఎక్కువ మంది సంతానాన్ని కనాలని భగవత్ చెబుతున్నారు. అలాగే చేసి ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తే వారికి ఆహారం ఆయన పెడతారా?' అని మాయ ప్రశ్నించారు. అదనపు పిల్లలందరికీ ఆహారం అందేలా చూడాలంటూ ముందుగా బీజేపీ అధ్యక్షుడికి చెప్పడంటూ భగవతకు సూచించారు.