గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (11:26 IST)

రాజస్థాన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన వానరం.. (వీడియో)

ఆగస్టు 15వ తేదీ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలాడింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ జెండాలను ఆవిష్కరించి, గౌ

ఆగస్టు 15వ తేదీ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా జాతీయ జెండా రెపరెపలాడింది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ జెండాలను ఆవిష్కరించి, గౌరవించారు. ఈ నేపథ్యంలో రాజ‌స్థాన్‌లోని పుష్క‌ర్‌లో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృత‌మైంది. స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల నాడు రాజ‌స్థాన్‌ అజ్మీర్ జిల్లాలో పుష్క‌ర్‌లో ఓ వాన‌రం జాతీయ జెండాను ఎగుర‌వేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పుష్క‌ర్‌లోని గాయ‌త్రి శ‌క్తిపీఠ్ మ‌హావిద్యాల‌యాలో జాతీయ జెండాను ఆవిష్క‌రించ‌డానికి ఏర్పాట్ల‌న్నీ పూర్తయ్యాయి. ఇక జెండా వంద‌నం చేయ‌డమే ఆల‌స్యం అనుకుంటున్న త‌రుణంలో రెండు వానరాలు అక్కడికొచ్చి.. జెండాకు క‌ట్టి ఉంచిన దారాన్ని ఒక్క‌సారిగా లాగేసాయి. దీనితో అక్క‌డి విద్యార్థులు చ‌ప్ప‌ట్లు కొట్టారు. 
 
సంతోషంతో ఈల‌లు, కేక‌లు వేశారు. అనుకోని అతిథి వ‌చ్చి జెండా ఎగుర‌వేసిన ఘ‌ట‌న‌ను చాలామంది త‌మ కెమెరాల్లో చిత్రీక‌రించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ చూడండి.