శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 జులై 2016 (17:25 IST)

స్వాతిని ఒకడు జుట్టు పట్టుకున్నాడు.. ఇంకొకడు నరికేశాడు.. లేటుగా చెప్పిన ప్రత్యక్ష సాక్షి!?

తమిళనాడు రాజధాని చెన్నైలోని నుగంబాక్కం రైల్వే స్టేషన్లో జూన్ 24వ తేదీ టెక్కీ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రామ్ కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడే స్వాతి హత్యకు కారణమని

తమిళనాడు రాజధాని చెన్నైలోని నుగంబాక్కం రైల్వే స్టేషన్లో జూన్ 24వ తేదీ టెక్కీ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో రామ్ కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడే స్వాతి హత్యకు కారణమని పోలీసులు అంటున్నారు. ఇంకా బలమైన ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వేచివున్నారు. ఈ నేపథ్యంలో స్వాతి కేసులో రోజుకో వార్త పుట్టుకొస్తోంది. రామ్ కుమార్ కోసం వాదించేందుకు న్యాయవాదుల బృందం ఉంది. 
 
ఈ బృందానికి చెందిన ఓ లాయర్ మాట్లాడుతూ.. స్వాతిని ఇద్దరు కలిసి హత్య చేసినట్లు చెప్పారు. స్వాతి హత్య కేసులో పలు అనుమానాలున్నాయని.. తనకు రిచ్చీ అనే వ్యక్తి ఫోను చేసినట్లు తెలిపాడు. అతడు స్వాతి హత్యను ప్రత్యక్షంగా చూశానని.. నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో కూర్చుని ఉండగా.. ఎక్కడి నుంచో వచ్చిన ఇద్దరిలో ఒకడు స్వాతిని జుట్టు పట్టుకోగా, మరొకడు ఆమెను నరికి చంపినట్లు లాయర్ వెల్లడించారు. 
 
తనకు, తన కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకూడదనే ఈ విషయాన్ని ఇన్నాళ్లు పోలీసులకు కూడా చెప్పలేదని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అందుచేత ఈ కేసులో నెలకొన్న అనుమానాలు, మిస్టరీ వీడాలంటే సీబీఐకి ఈ కేసును అప్పగించాలని రామ్ కుమార్ తరపు లాయర్ డిమాండ్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. స్వాతి మర్డర్ కేసు జరిగిన నెల పూర్తయిన తరుణంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో సీసీటీవీ కెమెరా గదుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే స్టేషన్లు, కంపార్ట్‌మెంట్లలో జరిగే నేరాలను అరికట్టే దిశగా ఈ సీసీటీవీ కెమెరాలు.. వాటిని అనుసంధానిస్తూ సీసీటీవీ గదులను ఏర్పాటు చేసేందుకు రైల్వే పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. 
 
దీనిపై డివిజనల్ రైల్వే మేనేజర్ అనుపమ్ శర్మ మాట్లాడుతూ.. నుంగం బాక్కం రైల్వే స్టేషన్లో సీసీటీవీ కెమెరా రూమ్ నిర్మాణం త్వరలో పూర్తవుతుందన్నారు. దీంతో పాటు 82 రైల్వే స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు, రిమోట్ కంట్రోల్ సౌలభ్యంతో 15 సీసీటీవీ ఏర్పాటు కోసం రూ.40.6 కోట్లను వెచ్చిస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్లలో భద్రత కోసం సాంకేతిక పరికరాల ఏర్పాటు ప్రక్రియ ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతుందని అనుపమ్ శర్మ వెల్లడించారు.