బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 జనవరి 2017 (16:41 IST)

మహారాష్ట్రలో కీచకపర్వం.. శివాజీ భక్తులమని బట్టలూడదీసి..? ముగ్గురు యువతుల వెంట 30 మంది?

అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు చిన్నపెద్దా తేడా వుండదు. ఏకంగా అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే కామాంధుల సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా బెంగళూరులో కామాంధులు విరుచుకుపడిన ఘట

అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు చిన్నపెద్దా తేడా వుండదు. ఏకంగా అమ్మాయిలపై అకృత్యాలకు పాల్పడే కామాంధుల సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా బెంగళూరులో కామాంధులు విరుచుకుపడిన ఘటన మరవక ముందే మహారాష్ట్రలో ఓ కొండను ఎక్కేందుకు వెళ్లిన అమ్మాయిలపై స్థానిక యువకులు జరిపిన అకృత్యం వెలుగులోకి వచ్చింది. 
 
మహారాష్ట్రలోని లోనావాలా ప్రాంతంలో పర్వతారోహణ చేస్తున్న అమ్మాయిలను మోరల్ పోలీసింగ్ అంటూ, అబ్బాయిలతో కలిసున్నారంటూ ఓ ముఠా బట్టలూడదీసి కొట్టింది. పూణేకు 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 
 
శివాజీ భక్తులమని చెప్పుకుంటూ ఇసాపూర్ కోటకు వచ్చిన వారిపై దౌర్జన్యం చేసింది. ఆ బృందంలోని అమ్మాయిలను దారుణంగా వేధించారు. ట్రెక్కర్స్ బృందంలో 12 మంది ఉండగా వారిలో ఉన్న యువతులపై కొందరు యువకులు దాడికి దిగారు. తమది 'ఫోర్డ్ లవర్స్' గ్రూప్ గా చెప్పుకున్న వారు, భారత సంస్కృతిని పాడుచేస్తున్నారని ఆరోపిస్తూ, కీచకపర్వానికి దిగారు. 
 
అమ్మాయిల వెంటవున్న వారిని కొట్టారు. వారసత్వ సంపద అయిన కోటను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలా ఉంటే బెంగళూరులో అమ్మాయిపై చోటుచేసుకుంటున్న కీచకపర్వం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఐటీ సిటీలోని ప్రధాన రహదారులైన బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్‌లలో పలువురు అమ్మాయిలు కొందరు అల్లరి మూకల చేతుల్లో నలిగిపోయారు. 
 
ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ ముగ్గురు అమ్మాయిలను 30 మంది మగవారు వెంటపడుతున్నారని.. అమ్మాయిల్ని పట్టుకుని చాలా దారుణంగా ప్రవర్తించారని.. బౌన్సర్లను పిలవడంతో పాటు పోలీసులకు సమాచారం అందిస్తామని చెప్పడంతో కామాంధులు వెనక్కి తగ్గినట్లు ఓ మహిళ పోలీసులతో వెల్లడించింది.