శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (08:00 IST)

కోడలికి పునర్జన్మ!.. కిడ్నీ దానం చేసిన అత్త

నిజంగా ఇలాంటి వారు కూడా ఉన్నారా అనిపిస్తుంది. ఆ అమ్మ ఓనాటి కోడలే అనే మాటకు అర్థం చెప్పింది. కూతురైనా, కోడలైనా ఒకటే అనే మాటకు సరియైన నిర్వచనమిచ్చింది. తన కిడ్నీని కోడలికి దానం ఇచ్చి తన ప్రాణాలు నిలబెట్టింది. వివరాలిలా ఉన్నాయి. 
 
పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌ నగర్‌కు చెందిన కవిత (36) కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నది. ఆమెకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పారు. కవితకు తన కిడ్నీ ఇవ్వడానికి ఆమె తల్లి ముందుకొచ్చారు. ఆపరేషన్‌కు ఏర్పాట్లు పూర్తయిన దశలో ఎందుకోగానీ ఆమె వెనక్కి తగ్గింది. చివరి నిమిషంలో తల్లి మనసు మార్చుకోవడంతో వైద్యులు సందిగ్ధంలో పడిపోయారు. 
 
ఈ పరిస్థితుల్లో కవిత అత్త విమల (56) ముందుకొచ్చారు. దీంతో వైద్యులే విస్మయానికి గురయ్యారు. వారం క్రితం ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించారు. ఇది సినిమాటిక్‌ జీవిత కథ కాదు. సుఖాంతమైన వాస్తవం..! అని ఆపరేషన్‌ బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్‌ సునీల్‌ ప్రకాశ్‌ వ్యాఖ్యానించారు. తనకు జన్మనిచ్చింది అమ్మ అయితే పునర్జన్మనిచ్చింది అత్తే. కాదు అత్త రూపంలోని అమ్మ..!