శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (09:42 IST)

ఎవరెస్ట్ పర్వత శ్రేణులపై స్వచ్ఛ భారత్.. 34 మంది బృందం రికార్డ్..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కనుంది. ఇప్పటికే  దేశమంతటినీ ఊడ్చేస్తున్న స్వచ్ఛ భారత్ ఎవరెస్ట్ పర్వత శ్రేణులపై పర్వతారోహణకు వెళ్లిన వారు వదిలేసిన వ్యర్థాలను తొలగించి రికార్డుకెక్కేందుకు నిర్ణయించింది. 
 
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించే క్రమంలో పర్వతారోహకులు దాదాపు నాలుగు వేల కిలోల ఘన వ్యర్ధాలను అక్కడ వదిలేసి వచ్చినట్లు సమాచారం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీటిని అక్కడి నుంచి తొలగించేందుకు భారత సైన్యం నడుం బిగించింది. 
 
ఇందుకుకోసం 34 మంది పర్వతారోహకులతో కూడిన ప్రత్యేక భారత సైనిక బృందం నేపాల్ మీదుగా ఎవరెస్ట్ చేరుకునేందుకు బయలుదేరింది. ఎవరెస్ట్ పై ఉన్న ఘన వ్యర్థాలను తొలగించడమే కాక ఎవరెస్ట్ మార్గంలో పడిన వ్యర్థాలను కూడా ఈ బృందం తొలగించనున్నట్టు స్వచ్ఛ భారత్ మిషన్ నిర్వాహకులు వెల్లడించారు.