Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ములాయం ఫోన్ చేసి ఏడ్చేశారు.. అందుకే పొత్తు పెట్టుకున్నాం.. ఆర్ఎల్‌డి

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (17:05 IST)

Widgets Magazine
Jayant Chaudhary

ఎస్పీ అధినేత ములాయం సింగ్ కన్నీరు కార్చారా.? రాష్ట్రీయ లోక్‌ దళ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ఆయన ఆ పార్టీ నేత కాళ్లావేళ్లాపడ్డారా? అవుననే అంటున్నారు ఆర్ఎల్‌డి ప్రధాన కార్యదర్శి. ఈ వివరాలను తాజాగా ఆయన బహిర్గతం చేశారు. 
 
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆర్‌ఎల్‌డీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అనంతరం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగింది. ఫలితంగా ఆర్‌ఎల్‌డీ ఇప్పుడు ఒంటరిగా పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
దీనిపై ఆర్ఎల్‌డి ప్రధాన కార్యదర్శి జయంత్ చౌదరి స్పందిస్తూ ఎస్పీ, కాంగ్రెస్ కూటమిలో చేరాలని తామేమీ ఉవ్విళ్లూరలేదన్నారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం ఫోన్‌ చేసి కంటతడి పెట్టడంతో తాము పొత్తుకు అంగీకరించామని చెప్పుకొచ్చారు. ఆ కూటమిలో చేరనంత మాత్రాన తమ పార్టీ బలహీనమైపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
'మీ స్నేహితుడెవరైనా ఫోన్‌ చేసి ఏడ్చి, సాయం కోసం అభ్యర్థిస్తే.. చేయడం మానేస్తారా? అలానే ములాయం ఫోన్‌ చేసి పొత్తు పెట్టుకోవాలని కోరడంతో రెండు నిమిషాల్లో పొత్తు నిర్ణయం తీసుకున్నాం' అని చెప్పారు. అంతే తప్ప కావాలని తామేమీ పొత్తుకు ముందుకు రాలేదన్నారు. తమ పార్టీ ఇప్పుడు మరింత బలంగా తయారైందని చెప్పారు. అనంతరం అఖిలేశ్‌పైనా వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Cried Phone Alliance Mulayam Singh Yadav Rld's Jayant Chaudhary

Loading comments ...

తెలుగు వార్తలు

news

లోకేష్ వెన్నుపోటు పొడుస్తాడేమోనని బాబుకు భయం... పవన్ మెరుపులా మాయం...

రాజకీయ నాయకుల్లో అతికొద్దిమంది తాము అనుకున్నది అనుకున్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ...

news

మహిళ ముక్కులోకెళ్లిన బొద్దింక... ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా ముక్కులోకి చిన్నపాటి దోమ వెళ్లినా బహు చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఏకంగా బొద్దింక ...

news

బాహుబలి అవతారంలో హరీష్ రావత్.. ఉత్తరాఖండ్‌ను ఎత్తేశాడు.. మోడీ అవాక్కయ్యారు..

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ...

news

సీల్డు కవర్.. సీఎం చాంబర్.. సేఫ్ లాకర్... మంత్రిగారి భవితవ్యం భద్రం.. ఎవరాయన?

ఓ సీల్డు కవర్. అందులే ఆ మంత్రివర్యుని భవితవ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా పరిశీలించి ...

Widgets Magazine