గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (09:16 IST)

పిట్టల్లా రాలిపోయిన 31 కోతులు... 14 పావురాలు.. ఎందుకు?

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ రసాయన కర్మాగారం నుంచి విషవాయువులు లీకై 31 కోతులు, 13 పావురాలు మృత్యువాతపడ్డాయి. రాయ్‌గఢ్ జిల్లాలోని పన్వెల్ మండలం పోశ్రీ అనే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
స్థానికంగా ఉండే ఓ నైట్రిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి విష వాయువు లీక్ కావడంతో 31 కోతులు, 14 పావురాలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. ఈ ప్రాంతానికి సమీపంలోనే వాటి మృతదేహాలను ఆ ఫ్యాక్టరీ సిబ్బంది పాతిపెట్టారు. ఈ ఘటనను బయటికిరానివ్వకుండా అధికారులు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు. 
 
అయితే, స్థానిక సిబ్బంది ఎవరో ఒకరు లీక్ చేయడంతో విషయం వెల్లడైంది. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని తనిఖీ చేశారని, సిబ్బంది పాతిపెట్టిన కోతులు, పావురాల మృతదేహాలను అటవీ సంరక్షణాధికారులు వెలికి తీశారు.