గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 23 ఆగస్టు 2014 (21:23 IST)

హోటల్ రూంలో నటి... చర్చ అంటూ రేప్ కు యత్నించి మ్యూజిక్ కంపోజర్

బాలీవుడ్ నటిపై మ్యూజిక్ కంపోజర్ అంకుర్ శర్మ అత్యాచార యత్నం చేసి కటకటాలపాలైన సంఘటన వెలికి వచ్చింది. వివరాల్లోకెళితే... నైరుతి ఢిల్లీలోని ద్వారక హోటల్లో శర్మ చిత్రం కోసం చర్చించాలంటూ నటి ఉంటున్న గదికి వెళ్లాడు. మ్యూజిక్ కంపోజర్ నీతో నాకు చర్చలేంటి అంటూ నటి అంటున్నా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
ఆమె తనకు దూరంగా ఉండాలన్నా వినకుండా ఆమెపైకి రేప్ చేసేందుకు వెళ్లాడు. ఈ హఠత్పరిణామంతో బిక్కచచ్చిపోయిన నటి హోటల్ రూంలో ఉన్న అలారంను మోగించింది. వెంటనే హోటల్ సిబ్బంది వచ్చి ఆమెను అతడి నుంచి రక్షించారు. పోలీసులకు సమాచారం అందించగా అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.