గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 22 మార్చి 2017 (15:36 IST)

ఆమెపై రేప్ జరిగినట్లు లేదే...? సందేహం ఎందుకు వచ్చింది?

ఓ అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది. కోర్టు విచారణలో ముంబైకి చెందిన 23 ఏళ్ల మహిళ పెట్టిన రేప్ కేసుపై అనుమానం వ్యక్తం చేసింది. తనపై రేప్ జరిగిందంటూ ఆ మహిళ చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవంటూ కింది కోర్టు నిందితుడికి విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెం

ఓ అత్యాచారం కేసు కొత్త మలుపు తిరిగింది. కోర్టు విచారణలో ముంబైకి చెందిన 23 ఏళ్ల మహిళ పెట్టిన రేప్ కేసుపై అనుమానం వ్యక్తం చేసింది. తనపై రేప్ జరిగిందంటూ ఆ మహిళ చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవంటూ కింది కోర్టు నిందితుడికి విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది ముంబై హైకోర్టు. 15 వేల రూపాయల పూచీకత్తుతో అతడికి బెయిల్ మంజూరు చేసింది.
 
సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదులో... తను జూన్ 11,2014న శిరోండాలోని తన సోదరికి ఇంటికి వెళుతుండగా సమీర్ అనే వ్యక్తి తనను తన కారులో బలవంతంగా ఎక్కించుకుని అనంతరం ఓ హోటలుకు లాక్కెళ్లి తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది. ఐతే ఆమె ఈ ఫిర్యాదును పోలీసులకు మరుసటి ఏడాది మే నెలలో చేయడం గమనార్హం. ఈ కేసుపై విచారణ చేసిన సెషన్స్ కోర్టు అతడిని దోషిగా నిర్థారిస్తూ జైలు శిక్ష విధించింది. దాంతో నిందితుడు తను నిరపరాధినంటూ హైకోర్టుకు అప్పీల్ చేశాడు. 
 
ఈ క్రమంలో ఈ కేసును బాంబే హైకోర్టు విచారించింది. నేరం జరిగి 11 నెలలయ్యే వరకూ బాధితురాలి అతడిపై కేసు ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్నించింది. అదేవిధంగా ఓ వ్యక్తి 23 ఏళ్ల మహిళను బలవంతంగా కారులో ఎక్కించడం, ఆ తర్వాత హోటల్ గదికి తీసుకెళ్లడం చేస్తుంటే ఆమె అరవకుండా ఎందుకు వున్నట్లు అని ప్రశ్నించింది. సాక్ష్యాలు, ఆధారాలపై అనుమానాలు వ్యక్తం చేసిన కోర్టు నిందితుడికి విధించిన శిక్షను సస్పెండ్ చేసింది.