Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వెస్ట్ బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. 36 మంది మృత్యువాత

మంగళవారం, 30 జనవరి 2018 (10:21 IST)

Widgets Magazine
bengal bus accident

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మహిళలతో సహా మొత్తం 36 మంది మృత్యువాతపడ్డారు. 
 
బెంగాల్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు 56 మంది ప్రయాణికులతో సోమవారం నదియా జిల్లాలోని షికార్‌పూర్‌ నుంచి మాల్దాకు బయలుదేరింది. బాలర్‌ఘాట్‌ వంతెనపై బస్సు ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించబోయి ఘోగ్రా కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీశారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
 
ఘటనా స్థలాన్ని సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవన్ కళ్యాణ్‌ రహస్యంగా భేటీ అయిన ఆ 25 మంది పెద్దలు ఎవరు?

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చడీచప్పుడుకాకుండా తన పార్టీని విస్తరిస్తున్నారు. ...

news

కలెక్టర్ ఆమ్రపాలి 'ఇట్స్ ఫన్నీ'పై తెలంగాణ సర్కారు సీరియస్

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి తెలుగులో ...

news

ప్రభుత్వ ప్రకటనలు ‘సాక్షి’కి ఇవ్వకండి... ఎందుకంటే?

ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు టిడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య వినతి పత్రం ...

news

కిలిమంజారో అధిరోహించిన ఏపీ విద్యార్థులు... మంత్రి అభినందనలు

అమరావతి: ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఏపీ సాంఘీక సంక్షేమ ...

Widgets Magazine