Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాతికేళ్లు జైల్లో మగ్గిపోయాక ప్రపంచాన్ని తొలిసారి చూసిన రాజీవ్ హంతకుడు.. మళ్లీ మరోనేరమా?

హైదరాబాద్, శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (02:29 IST)

Widgets Magazine

అది క్షణికావేశమో.. కరడుగట్టిన సిద్ధాంతం ప్రభావమో.. తదనంతర పరిణామాలను ఊహించని అమాయకత్వమో.. ఏదైతైనే రాజీవ్ గాంధీ హత్యకేసులో అతడు పాలుపంచుకున్నాడు. నేరం రుజువై గత పాతికేళ్లుగా ప్రపంచానికి దూరంగా జైలులో మగ్గుతున్నాడు. ఇన్నేళ్లుగా బయటకు రాని వ్యక్తి మళ్లీ మరో నేర చర్యలో భాగంగా కోర్టు ముఖం చూశాడు. జైలులో మౌనవ్రతం పాటిస్తూ ఒక బాబా లాగా జీవితం గడుపుతున్నాడని చెబుతున్న వ్యక్తి సెల్‌ఫోన్లు, చార్జరు, సిమ్ కార్డులు దాచి ఉంచిన నేరంపై మళ్లీ కోర్టు గుమ్మం తొక్కాడు.
 
ఎల్టీటీఈ చేతిలో దారుణంగా హతమార్చబడిన మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ 25 ఏళ్ల తర్వాత మొట్ట మొదటిసారిగా వేలూరు కోర్టులో హాజరయ్యాడు. రాజీవ్‌ హత్య కేసులో మురుగన్, అతని భార్య నళినితో పాటు పేరరివాలన్, శాంతన్‌ మొత్తం ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం విదితమే. జైలులో సెల్‌ఫోన్‌లు నిషేధం ఉన్న నేపథ్యంలో జైలు అధికారులు మురుగన్‌ గదిలో తనిఖీలు చేపట్టి రెండు సెల్‌ఫోన్‌లు, చార్జరు, రెండు సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జైలు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు.
 
మురుగన్‌ సెల్‌ఫోన్‌ ఉపయోగించినందున మూడు నెలలపాటు ఎవరినీ కలిసి మాటాడేందుకు అవకాశం ఇవ్వలేదు. జైలు గదిలో సెల్‌ఫోన్‌ ఉపయోగించిన కేసులో వేలూరు జెఎం వన్‌ కోర్టులో గురువారం విచారణకు వచ్చింది. మురుగన్‌ కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి మే నెల 4వ తేదికి వాయిదా వేశారు. అనంతరం పోలీసులు మురుగన్‌ను జైలుకు తీసుకెళ్ళారు. అయితే, ఆయనతో న్యాయవాది తప్ప ఎవరినీ కలిసి మాట్లాడేందుకు అనుమతించలేదు.
 
జీవితంలో పాతికేళ్ల సుదీర్ఘ కాలాన్ని ఊచలు లెక్కపెట్టుకుంటూ బతకాల్సి వచ్చిన వ్యక్తి మరో చిన్ననేరంపై కోర్టుకు వచ్చాడంటే వీరిలో పరివర్తన ఏమేరకు జరిగిందన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వివాహేతర సంబంధం... మరొకరితో లింక్ పెట్టుకుందని టీచర్ గొంతుకోసిన మరో టీచర్(video)

మహిళలపై దారుణాలు ఆగడంలేదు. చిత్తూరు జిల్లాలో గురువారం దారుణం ఘటన జరిగింది. గంగవరం మండలం ...

news

ప్రియురాలి కోసం విమానం హైజాక్... హైదరాబాద్ యువకుడు....

పిచ్చి ప్రియులు అని ఇలాంటివారినే అంటుంటారు. తాము అనుకున్నది జరుగకపోతే పిచ్చిపిచ్చి ...

news

గ్రామవేదికపై అమ్మాయిలకు ముద్దులుపెడుతూ.. నృత్యం చేస్తూ అధికారుల మజా...

వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని ...

news

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారో తెలుసా?

అమ్మా స్కూల్‌కు వెళతా.. ఉండు నాన్నా మంచి ర్యాంక్ సాధించిన ప్రైవేటు స్కూల్లో నిన్ను ...