శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 22 మార్చి 2017 (11:51 IST)

రామ జన్మభూమి- బాబ్రీ వివాదం.. చర్చలకు సిద్ధమే.. ముస్లిం లా బోర్డు ప్రకటన

అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం కోసం అత్యున్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించింది. అంతేగాకుండా

అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం కోసం అత్యున్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. అయోధ్య వివాదాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించింది. అంతేగాకుండా భావోద్వేగాలకు ముడిపడిన ఈ సున్నితమైన అంశంపై కోర్టుకు వెలుపలే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సుప్రీం పేర్కొంది. 
 
ఇరు వర్గాలు కోరితే మధ్యవర్తిత్వానికి సిద్ధమని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. అర్థవంతమైన, చిత్తశుద్ధితో కూడిన చర్చలు జరిగితేనే ఈ వివాదంపై చర్చలు సఫలమైనట్లు గ్రహించాలన్నారు. మతంతో పాటు సున్నితమైన భావోద్వేగాలు ఈ కేసుతో ముడిపడినందున చర్చల ద్వారా ఈ అంశాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీం సూచించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సూచనల మేరకు అయోధ్యలో రామమందిరం అంశాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తేల్చేసింది.
 
దీనిపై ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు కమల్ పరుఖ్వీ మాట్లాడుతూ.. చర్చల ద్వారా సున్నితమైన అంశాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీం కోర్టు సూచించడం మంచి పరిణామమని తెలిపారు. చర్చల ద్వారా ఓ నిర్ణయానికి వచ్చి.. ఆపై కోర్టు పరంగా దానిని అమలు చేసేందుకు ప్రయత్నించడం ఉత్తమమైన మార్గమని కమల్ వ్యాఖ్యానించారు. తద్వారా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు కమల్ చెప్పుకొచ్చారు.