బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (09:59 IST)

గర్భిణీ మహిళపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. రోడ్డుపై వేచి ఉండగానే ప్రసవం..!

ప్రభుత్వాసుపత్రులు గర్భిణీ మహిళలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. నెలలు నిండి పురిటి నొప్పులతో కాన్పు కోసం వెళ్లిన ముజఫర్ నగర్ అల్లర్ల బాధితురాలికి స్థానిక కాండ్లా ప్రాథమిక ఆ

ప్రభుత్వాసుపత్రులు గర్భిణీ మహిళలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. నెలలు నిండి పురిటి నొప్పులతో కాన్పు కోసం వెళ్లిన ముజఫర్ నగర్ అల్లర్ల బాధితురాలికి స్థానిక కాండ్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నుండి ఈసడింపులు ఎదురయ్యాయి. ఆమెకు ప్రసవం అయ్యేందుకు ఇంకా మూడు రోజులు సమయం ఉన్నందున ఇంటికి వెళ్లిపోమన్నారు. 
 
అయితే ఆమె భర్త తన భార్య పడుతున్న బాధను చూసి చలించిపోయాడు. దయచేసి ఆస్పత్రిలో చేర్చుకోవాల్సిందిగా వైద్య సిబ్బంది వద్ద వేడుకున్నాడు. బతిమాలినా వారిలో కనికరం కూడా కలగలేదు. చివరకు ఆమెను తీసుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై వేచి ఉండగా ఆమెకు అక్కడే ప్రసవం అయిపోయింది. ఆ  తర్వాతే ఆమెను వేరొక ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా ఈ అంశంపై యూపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. వెంటనే దీనిపై నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించింది. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు వెల్లడించారు.