Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయలలిత మృతిపై విచారణ చేసుకోమను... నాకేంటి భయం : శశికళ

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (14:32 IST)

Widgets Magazine
sasikala

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం అనేక కొత్త విషయాలను బయటపెడుతోంది. జయలలిత మృతికి సంబంధించి మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ.పన్నీరు సెల్వం జయ మృతిపై అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. 
 
పైగా, అమ్మ మృతికి సంబంధించి నెలకొన్న అనుమానాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని పన్నీరు సెల్వం ప్రకటించారు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలిసేందుకు ప్రయత్నించానని, కానీ శశికళ కలవనీయలేదని పన్నీరు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పెద్ద దుమారాన్నే రేపాయి. 
 
ఈ వ్యాఖ్యలపై శశికళ స్పందించారు. పన్నీర్ చేసినవన్నీ ఆరోపణలేనని కొట్టిపారేశారు. జయలలిత మృతికి సంబంధించి విచారణ చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో తాను భయపడాల్సిన పని లేదన్నారు. తన మీద వస్తున్న సందేహాలను ఆమె ఖండించారు. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో సోదరిలా చూసుకున్నానని, ఆ విషయం తనకు తెలుసని శశికళ చెప్పారు. 
 
తనను ఎలా చూసుకున్నానో జయలలితకు బాగా తెలుసని ఆమె తెలిపారు. జయలలితను సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకున్నానని, ఆ విషయం ఆసుపత్రి సిబ్బందిని అడిగితే వివరంగా చెబుతారని శశికళ చెప్పారు. విచారణకు తాను భయపడాల్సిన పనిలేదని శశికళ తేల్చి చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుమల శ్రీవారి ఖర్చులకు డబ్బుల్లేవు... రూ.కోట్లు ఏమైపోతున్నాయి?

ఒకప్పుడు తన వివాహం కోసం కుబేరుడి వద్ద అప్పు చేసిన శ్రీనివాసుడు. ఇప్పుడు ఆ కుబేరునికే ...

news

చిన్నమ్మదంతా నాటకమే.. మీటింగ్‌కు వచ్చింది సగంమందే.. పట్టుబిగిస్తున్న పన్నీరు సెల్వం....

తమిళ రాజకీయాల్లో ఇప్పుడు హీరోగా మారిపోయారు పన్నీరుసెల్వం. ప్రతిపక్ష పార్టీలే కాదు సొంత ...

news

ఈసారి మంత్రి పదవి రాకుంటే తెదేపాకు రాం.. రాం...! ఎవరు..?

త్వరలో జరిగే ఏపీ కేబినెట్ మంత్రివర్గ విస్తరణలో ఎంతోమంది సీనియర్ నేతలు, బాబుకు అత్యంత ...

news

చిన్నమ్మ సీఎం అయితే జల్లికట్టు తరహా పోరాటానికి సై: విద్యార్థి సంఘాలు

తమిళనాడు సీఎం పీఠంపై కన్నేసిన శశికళకు వ్యతిరేకంగా రాష్ట్ర యువత పోరుకు సై అంటున్నట్లు ...

Widgets Magazine