గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2016 (09:58 IST)

జయకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ వైద్యులు పనికిరారా? రాష్ట్రంలో మంచి ఆస్పత్రే లేదా?

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై డాక్టర్ కృష్ణ ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ఉండి ఆమె ప్రాణాలు కోల్పోవడం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. జయలలిత అనారోగ్యమూ, అందుకు జరిగిన

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై డాక్టర్ కృష్ణ ప్రశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ఉండి ఆమె ప్రాణాలు కోల్పోవడం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. జయలలిత అనారోగ్యమూ, అందుకు జరిగిన చికిత్స, ఆమె మరణమూ కూడా ఎందుకు అంత రహస్యంగా మారాయని ఆమె అడిగారు. అసలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఆమె అనారోగ్యంతో ఉన్నారని వార్తలు వచ్చాయి.
 
ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్ సంస్థల్లో గానీ ఒక చిన్న ఉద్యోగంలో చేరాలంటే.. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి. అలాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడే అభ్యర్ధికి ఆరోగ్య పరీక్షలేవీ జరగవా? వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించే ఎన్నికలకు ముందు అభ్యర్ధులకు ఆరోగ్య ధ్రువీకరణలు అవసరం లేదా? అంటూ తిరుపతికి చెందిన ఆ డాక్టర్ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
వీఐపీలకు సేవలందించే ప్రభుత్వ వైద్యులు అమ్మకు చికిత్స చేసేందుకు పనికిరాలేదా? తమిళనాడు ముఖ్యమంత్రికి తగిన వైద్యం అందించగలిగిన ఆసుపత్రి ఆ రాష్ట్రంలో ఒక్కటీ లేదా? నూరేళ్ళ చరిత్ర కలిగిన స్టాన్లీ మెడికల్‌ కాలేజి, మద్రాస్‌ మెడికల్‌ కాలేజి ఉన్నది చెన్నై నగరంలోనే.. అలాంటి సుప్రసిద్ధ ఆస్పత్రులుండి అమ్మ చికిత్స ఫలించక మరణించడం ఏమిటని ప్రశ్నించారు.
 
అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు ఎందరో ఈ ఆసుపత్రుల్లో ఉన్నారు. వీరి సేవలు ఎందుకు ఉపయోగపడలేదు? తాజాగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో కేంద్రమంత్రికి కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. జయలలితను ఎయిమ్స్‌కి ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు.