శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2016 (09:06 IST)

చీకటి రాజకీయాలకు జయలలిత బలైందా? చివరి ఘడియల్లోనూ నమ్మకద్రోహం!

కోట్లాది మంది ప్రజలతో 'అమ్మ' అని ముద్దుగా పిలిపించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత చీకటి రాజకీయాలకు అశువులు బాసినట్టు సమాచారం. చివరి ఘడియల్లోనూ ఆమెను వెన్నంటి ఉండేవారు

కోట్లాది మంది ప్రజలతో 'అమ్మ' అని ముద్దుగా పిలిపించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత చీకటి రాజకీయాలకు అశువులు బాసినట్టు సమాచారం. చివరి ఘడియల్లోనూ ఆమెను వెన్నంటి ఉండేవారు నమ్మకద్రోహానికి పాల్పడినట్టు సమాచారం.
 
నిజానికి జయలలిత బాల్యం నుంచి తుది శ్వాస విడిచేంత వరకు ఒటరి పోరాటం చేసింది. బాల్య నటిగా, సినీనటిగా, రాజకీయ నాయకురాలిగా ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు, చీత్కారాలు, జీర్ణించుకోలేని వేదనలు, నమ్మక ద్రోహాలును ఎదుర్కొంది. అయినప్పటికీ.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి ప్రజారంజకమైన పాలన అందించారు. అలాంటి అమ్మ... చివరికి మరణంలోనూ నమ్మకద్రోహానికి బలైపోయారా? ఇదే... ఇప్పుడు తమిళ ప్రజల్ని వేధిస్తోన్న ప్రశ్న. జయ మరణం వెనుకదాగున్న భయంకరమైన కుట్ర బయటపడాలంటే విచారణ జరగాల్సిందేనని తమిళ ప్రజలు సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు.
 
అమ్మ పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారనీ, ఆమె ఎప్పుడు వెళ్లాలనుకుంటే, అప్పుడు ఆస్పత్రి నుంచి పంపించేస్తామని అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. పైగా, 24 గంటలూ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉండే జయలలితకు ఉన్నట్టుండి గుండెపోటు ఎలా వచ్చిందన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 
 
ఆమెకు గుండెపోటు తెప్పించిన ఘటన ఏంటి అన్నదానిపై సమాధానాలు రావాలంటే ప్రతాప్ రెడ్డిని విచారిస్తే అన్నీ బయటకొస్తాయంటూ అమ్మ అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాదు, జయలలిత పోతే, శశికళను బెదిరించి.. భయపెట్టి తమిళరాజకీయాల్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చన్న బీజేపీ పెద్దల కుటిలయత్నం బయటపడుతుందనే విచారణపై కిక్కురుమనడంలేదన్నది అమ్మ అభిమానుల ఆవేదన.