Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. కోరిక తీర్చాలన్నాడు..

మంగళవారం, 5 డిశెంబరు 2017 (19:28 IST)

Widgets Magazine
video shoot

మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి.. ఆమెను బెదిరించిన వ్యక్తిని బాధితురాలి భర్త, స్నేహితులు కొట్టి చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లా కుమారపాళెంకు చెందిన నాగరాజ్... అదే ప్రాంతానికి చెందిన కామరాజ్ సతీమణి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. ఈ వీడియోను కామరాజ్ భార్య వద్దే చూపించి.. తనతో గడపాలని లేకుంటే ఈ వీడియోను వాట్సాప్‌లో అప్ లోడ్ చేసేస్తానని బెదిరించాడు.
 
దీంతో షాకైన బాధితురాలు.. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది. తన భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీయడమే కాకుండా.. దాన్ని చూపి బెదిరించిన నాగరాజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా నాగరాజ్ ఫోనులో వున్న వీడియోను తొలగించాలని.. మెమరీ కార్డ్ ఇచ్చేయాలని అడిగాడు. కానీ నాగరాజ్ ఇవ్వకపోవడంతో స్నేహితులతో కలిసి అతనితో కామరాజ్ గొడవకు దిగాడు. 
 
ఈ గొడవలో నాగరాజ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో స్పృహతప్పి కిందపడిపోయిన నాగరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై నాగరాజ్ సతీమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామరాజ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పార్కులోనే విద్యార్థితో లైంగికంగా కలిసిన భారత సంతతి టీచర్

పార్కులో ఓ 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు.. 16ఏళ్ల తన విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది. ఏపీకి ...

news

ఆర్కే నగర్ ఎన్నికలు... విశాల్ నామినేషన్ తిరస్కరణ.. రోడ్డుపైనే ధర్నా

ఆర్కేనగర్ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలైన నామినేషన్‌ను ఎన్నికల సంఘం అధికారులు ...

news

విశాఖలో పర్యటించనున్న పవన్ కల్యాణ్.. డీసీఐకు మద్దతు

కేంద్ర ప్రభుత్వ రంగ ''డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా"(డీసీఐ) ప్రైవేటీకరించాలని ...

news

విశాల్‌కు టీటీవీ దినకరనే డబ్బులిచ్చి ఆర్కే నగర్‌కు పంపించారట

నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్మాత సంఘం అధ్యక్షుడు, నటుడు అయిన విశాల్ ఆర్కే నగర్ ...

Widgets Magazine