శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:10 IST)

నల్లధనం కాదుకదా.. ఓ కుందేలును పట్టుకోలేదు : శరద్ యాదవ్

విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత శరద్ యాదవ్ తనదైనశైలిలో కామెంట్స్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి తీసుకువస్తామన్న కేంద్రం ఆ పని ఎన్నటికీ చేయలేదని జోస్యం చెపుతున్నారు. 
 
నల్లధనాన్ని భారత్ తీసుకురావడం తమ స్వప్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు చెప్పుకుంటోందని, కనీసం ఓ కుందేలును కూడా విదేశాల నుంచి దేశంలోకి తీసుకురాలేరని వ్యాఖ్యానించారు. 627 మందితో కూడిన నల్ల కుబేరుల జాబితాను కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో, అర్థంలేని చర్చ నడుస్తోందని మండిపడ్డారు. నల్లధనం దేశంలోకి వచ్చే అవకాశమే లేదని తాను భావిస్తున్నానని శరద్ యాదవ్ తెలిపారు.