శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (15:36 IST)

విమానం ల్యాండ్ అవుతుంటే నాలుగు టైర్లూ పేలిపోయాయి... తర్వాత?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులంతా బిగ్గరగా కేకలు వేస్తూ బెంబేలెత్తిపోయారు.

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులంతా బిగ్గరగా కేకలు వేస్తూ బెంబేలెత్తిపోయారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీ నుంచి జమ్ము మీదుగా శ్రీనగర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (ఏఐ) 821 విమానం జమ్ము విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. 
 
ఈ విమానం రన్ వేపై ల్యాండ్ అవుతుండగా విమానం టైర్లు పంక్చర్ అయ్యాయి. పెద్ద శబ్దం చేస్తూ నాలుగు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో విమానం ఒక్కసారిగా భారీ కుదుపునకులోనైంది. ఉన్నట్టుండి ఇలా జరగడంతో అందులోని ప్రయాణికులంతా హడలిపోయారు. అయితే పైలట్ విమానాన్ని అద్భుతంగా నియంత్రించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 
 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం 11.05 గంటలకు ఢిల్లీలో బయలుదేరిన ఈ విమానం 12.20 నిమిషాలకు జమ్మూకు చేరుకుంది. ఆ సమయంలోనే ఈ విమానం టైర్లు పేలిపోయాయి. పిమ్మట టైర్లు మార్చాక జమ్మూ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.45 గంటలకు శ్రీనగర్‌కు చేరుకుంది.