శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 జులై 2024 (08:50 IST)

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు : మాస్టర్ మైండ్ అరెస్టు

arrest
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాస్టర్ మైండ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. నిందితుడిని పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్యగా గుర్తించారు. 2017 బ్యాచ్ జెంషెడ్ పూర్ ఎన్.ఐ.టి విద్యార్థిగా గుర్తించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని హజారీ బాగ్‌లో ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాకర్ (ఎన్టీఏ ట్రంకు పెట్టె) నుంచి నీట్ యూజీ ప్రశ్నపత్రాన్ని ఆదిత్య చోరీ చేసినట్టు గుర్తించారు. బొకారో నివాసి అయిన పంకజ్ కుమార్‌ను సీబీఐ అధికారులు బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో అదులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రం చోరీ చేసేందుకు అతడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు హజరీ బాగ్‌లో అరెస్టు చేశారు. తాజాగా అరెస్టులతో కలిపి నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 14కు చేరింది. 
 
ఆర్థోస్కోపీ కోసం ఆస్పత్రికి వెళ్లిన కజకిస్థాన్ మహిళ.. మత్తులో ఉండగా అత్యాచారం... 
 
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. కజకిస్థాన్ మహిళపై కొందరు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆర్థోస్కాపి చేసుకునేందుకు ఆస్పత్రికి ఆ మహిళకు వైద్యులు మత్తు ఇచ్చారు. దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన కామాంధులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ నెల 9వ తేదీన ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 9వ తేదీన కజకిస్థాన్‌కు చెందిన 51 యేళ్ల మహిళ హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఉన్న ఆర్టిమిస్ ఆస్పత్రి అనే ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్థోస్కోపీ చేసుకునేందుకు చేరారు. ఆమెకు 13వ తేదీన ఈ చికిత్స చేశారు. ఇందుకోసం ఆమెకు మత్తుమందు ఇచ్చారు. దీంతో ఆమె మత్తులోకి జారుకున్నారు. అదే అదునుగా భావించిన అటెండెంట్‌గా పని చేసే ఠాకూర్ సింగ్ (25) లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన బాధితురాలి కుమార్తె ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేసింది. 
 
అదేసమయంలో ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆస్పత్రి వర్గాలు స్పందిస్తూ, నిందితుడిని తాత్కాలికంగా ఉద్యోగం నుంచి తొలగించినట్టు వెల్లడిస్తూ, పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నాయి.