Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉప రాష్ట్రపతి వద్దు.. ఉషాపతిగా ఉండటమే ముద్దంటున్న వెంకయ్య!

సోమవారం, 17 జులై 2017 (09:39 IST)

Widgets Magazine

భారత ఉపరాష్ట్రపతి రేసులో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడి పేరు తెరపైకి వచ్చింది. యూపీఏ కూటమి తరపున ఇప్పటికే జాతిపిత మహాత్మా గాంధీ మనవడు, వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును ఖరారు చేసింది. కానీ, బీజేపీ మాత్రం ఇప్పటివరకు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ వస్తోంది. 
 
అయితే, అనూహ్యంగా వెంకయ్య పేరు తెరపైకి వచ్చింది. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ పదవికి వెంకయ్యనాయుడు అన్నివిధాలా సమర్థుడనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్టు సమాచారం. వెంకయ్యనాయుడు అయితేనే, భాగస్వామ్య పక్షాలన్నీ ఆమోదిస్తాయనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది. 
 
పార్టీ కీలక నేతగా సంక్షోభ సమయాల్లో వెంకయ్యనాయుడు పోషించిన పాత్రను బీజేపీ పరిగణనలోకి తీసుకుందని సమాచారం. వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని, ఏ రకంగా చూసినా కూడా ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని, ఆ పదవికి వన్నె తెస్తారనే సమష్టి అభిప్రాయానికి ఎన్డీఏ పక్షాలు వచ్చాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అయితే, వెంకయ్య నాయుడు మాత్రం క్రియాశీలక రాజకీయాలను తప్పుకుని రాజ్యాంగ పదవిని అధిరోహించేందుకు సిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు.. పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు కూడా. తాను ఉషాపతిగానే ఉంటానని, ఉపరాష్ట్రపతే కాదు.. ఏ పతులు తనకు అక్కర్లేదని తెగేసి చెప్పారు. 
 
కానీ, బీజేపీ అధినాయకత్వం మాత్రం వెంకయ్య వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో పార్టీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, ఓ.రాజగోపాల్, నజ్మాహెప్తుల్లా, సీహెచ్ విద్యాసాగర్ రావు వంటి పేర్లూ పరిశీలనలో ఉన్నాయి. దీంతో వెంకయ్య పేరును చివరి నిమిషం వరకు సస్పెన్స్‌లో ఉంచేలా తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా... రైలులో ఫొటో తీసుకుంటూ ఫార్మసి విద్యార్థి మృతి

విశాఖపట్టణంలో సెల్ఫీ సరదా ఓ ఫార్మసీ విద్యార్థి ప్రాణాలు తీసింది. అరకులోయ సందర్శన కోసం ...

news

నేడు రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ : రాంనాథ్ కోవింద్ ఎన్నిక లాంఛనమేనా?

దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం దేశవ్యాప్తంగా 32 ...

news

స్వీట్‌గా పిలిచిందని చాన్స్ తీసుకున్నారో.. గుండు కొట్టిస్తారు జాగ్రత్త

తీయటి గొంతులో ఎవరైనా పిలిస్తే దారిన పోతున్నా సరే.. ఏ మానవుడైనా చలించకుండా, స్పందించకుండా ...

news

మూడేళ్లు ఓపిక పడితే ముప్పై ఏళ్లు నువ్వే సీఎం అన్నా.. వైఎస్ జగన్ ఒప్పుకోలే.. షబ్బీర్

ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన అత్యంత కీలక క్షణాల్లో కాంగ్రెస్ అధిష్టానం చేసిన ముఖ్య ...

Widgets Magazine