మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : మంగళవారం, 3 మార్చి 2015 (14:24 IST)

రేప్ చేస్తే ఆడవాళ్లు మౌనంగా చేయించుకోవాలి... నిర్భయ దోషి సంచలనం

దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిని దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత అతి క్రూరంగా హింసించిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఆ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగడంతో నిర్భయ చట్టాన్ని తెచ్చింది యూపీఎ ప్రభుత్వం. దాని ప్రకారం నిర్భయ నిందితులకు శిక్ష కూడా ఖరారైంది. ఐతే నిర్భయ కేసు నిందితుడు ముఖేష్ సింగ్ మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అతడు బీబీసికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  "ఆడవారు రేప్‌లు చేస్తే చేయించుకోవాలి. 
 
అసలు వాళ్ళకు అర్థరాత్రి పూట ఏం పని. ఎందుకు అర్థరాత్రి పూట తిరగాలి. ఇంట్లో వారికి వీరు ఏమని చెప్పి బయటకు వస్తున్నారు. అర్థరాత్రి దాటాక కూడా మగాళ్లతో బయట తిరుగుళ్లు ఏంటి. అత్యాచార విషయాల్లో మగాళ్లనే తప్పుపడుతుంటారు కానీ అందులో ఆడవాళ్లకు కూడా భాగం ఉంటుంది. కేవలం ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేము. అబ్బాయిలు, అమ్మాయిలు పబ్బులు, డిస్కోలకు విచ్చలవిడిగా తిరిగితే ఫర్వాలేదా? అర్థ నగ్నంగా దుస్తులు వేసుకుని తిరుగుతుంటే ఏ మగాడైనా చూస్తూ ఊరుకుంటాడా?. 
 
అబ్బాయిలు, అమ్మాయిలు సమానమైనప్పుడు ఉరిశిక్ష ఎందుకు. అలా ఉరిశిక్షలు విధిస్తే బాధిత మహిళలకు ప్రాణహాని ఉంటుంది. నిర్భయను బలాత్కరిస్తున్నప్పుడు ఆమె మౌనంగా ఉండాల్సింది. ఎలాంటి ప్రతిఘటనా చేకుండా ఉండాల్సింది. ఆమెపై అత్యాచారం చేసినప్పుడు నేను బస్సు నడుపుతున్నా. ఆడవారు గౌరవంగా ఇంట్లో ఉంటే ఎవరికీ వారిని ఏమీ చేయాలనిపించదు" అంటూ ఉరి శిక్ష పడినప్పటికీ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వివరించాడు నిర్భయ నిందితుడు ముఖేష్.