Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీఎం నితీశ్‌పై అలక.. జేడీయుకు శరద్ యాదవ్ రాజీనామా?

ఆదివారం, 16 జులై 2017 (13:40 IST)

Widgets Magazine
sharad yadav

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై జేడీయు అధినేత శరద్ యాదవ్ అలకబూనారు. దీంతో అధ్యక్ష పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. బీహార్‌లో జనతాదళ్ (యు)తో పాటు.. ఆర్జేడీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నాయి. అయితే, ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్‌ తక్షణం రాజీనామా చేయాలని, ఈ మేరకు సీఎం నితీశ్ కుమార్ ఒత్తిడి చేస్తున్నారు. ఇది శరద్ యాదవ్‌కు ఏమాత్రం నచ్చడం లేదు. 
 
అదేసమయంలో నితీశ్ కుమార్ బీజేపీ పట్ల సానుకూలత కనబరుస్తుండటంపై కూడా శరద్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీజేపీతో చేతులు కలపడం ఆత్మహత్యా సదృశమని వాదిస్తున్న జేడీయూ నేతలతో శరద్ యాదవ్ మంతనాలు జరుపుతున్నారు. నితీశ్ కుమార్ బీజేపీకి దగ్గరైతే తాను జేడీయూకు రాజీనామా చేస్తానని శరద్ యాదవ్ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఇదే జరిగితే జేడీయులో అంతర్గత సంక్షోభం తప్పదని తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సిగరెట్లలో నింపి గుప్పుమంటూ పీల్చుతూ బీటెక్ విద్యార్థుల గం'జాయ్'

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ గుట్టు సంచలనం రేపుతోంది. ఇంతలో బీటెక్ విద్యార్థుల ...

news

మోడీ విదేశీ టూర్ ఖర్చులడిగితే... ప్రశ్నలో అస్పష్టత ఉందంటూ జవాబు దాటేసిన పీఎంఓ!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటన ఖర్చులు ఇవ్వండి అంటూ సమాచార హక్కు ఉద్యమకారిణి ...

news

అదృష్టమో... దురదృష్టమో ఆ మంత్రి నారా లోకేష్... బుట్టా రేణుక

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ఉన్న నారా లోకేశ్‌ను అభివృద్ధి పనుల విషయంగానే తాను ...

news

174 మంది ప్రాణాలు తీయబోయిన పక్షి.. ఎలా?

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి ...

Widgets Magazine