గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (19:02 IST)

తప్పుడు పనులొద్దు.. ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరూ వద్దు: లాలూ

ప్రభుత్వం కేటాయించకముందే ఆర్జేడీ, జేడీయూ ఎమ్మెల్యేలు విలాసవంతమైన అధికారిక నివాసాల కోసం ఆరాటపడుతూ కొట్లాటకు దిగడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలకు లాలూతో పాటు ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సైతం క్లాజ్ తీసుకున్నారు. కాస్త పద్ధతిగా నడుచుకోవాలని, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమి గౌరవాన్ని నిలపాలని సూచించారు. 
 
తప్పుడు పనులతో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు సంపాదించిపెట్టవద్దని ఎమ్మెల్యేలకు మొట్టికాయలు వేశారు. గతంలో తాను సీఎం అయిన తర్వాత కూడా నాలుగు నెలల పాటు చప్రాసీ క్వార్టర్స్‌లోనే గడిపానని.. ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు. కాగా బీహార్‌లో కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ భవనాల కోసం ఎగబడుతుంటడం సరికాదని లాలూ వ్యాఖ్యానించారు. విలాసవంతమైన భవనాల కోసం కొట్లాడుకోకుండా ఉండాలని తద్వారా ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తేవొద్దన్నారు.