గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:20 IST)

తమిళనాడు సీఎంగా శశికళ ఎన్నిక... అన్నాడీఎంకే నేతల లోగుట్టు కథ ఇదే...

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను అన్నాడీఎంకే నేతలంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గల కారణాలపై వివిధ రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్నంతకాలం కింది స్థాయి కార్యకర్త న

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను అన్నాడీఎంకే నేతలంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గల కారణాలపై వివిధ రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్నంతకాలం కింది స్థాయి కార్యకర్త నుంచి కేబినెట్ ర్యాంక్ మంత్రి వరకు బిక్కుబిక్కుమంటూ పార్టీలో కొనసాగారు. ముఖ్యంగా మంత్రులంతా తెల్లవారేసరికి మంత్రి పదవుల్లో ఉంటామో లేదోనన్న భయంతోనే గడిపారు. 
 
అయితే, జయలలిత మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు బందీలుగా ఉన్న ఏడీఎంకే నేతలు.. జయ మరణం తర్వాత తమకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందన్న చందంగా ఉన్నారు. అదేసమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలను శశికళ చేపట్టారు. ఇంతలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె సమ్మతించి ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించారు. దీంతో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకోగా ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఝులక్ ఇచ్చారు. 
 
ఇదిలావున్నప్పటికీ.. శశికళను ఉన్నఫళంగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి గల ప్రధాన కారణం. జయలలిత జీవించివున్నంత వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏడీఎంకే నేతలకు జేబులు ఖాళీ అయ్యాయేగానీ.. ఎక్కడా కూడా తమ ప్యాకెట్లను నింపుకోలేక పోయారు. ఏమాత్రం చిన్నపాటి ఆరోపణ వచ్చినా... ఆ మరుక్షణమే ఆ మంత్రి లేదా ఎమ్మెల్యే లేదా నేతపై వేటు వేసేవారు. 
 
కానీ, జయలలిత మరణించిన తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. శశికళకు జైకొట్టి... వంగివంగి నమస్కారం చేయడం వల్ల తమ పనులు చక్కబెట్టుకోవచ్చన్నది నేతలు అభిప్రాయంగా ఉంది. పైగా ఇక భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేదు. అంటే ఇంతటితో తమ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాఫ్‌పడటం ఖాయమని భావిస్తున్నారు. దీంతో 2021 వరకు ఇష్టానుసారంగా రెండు చేతులా సంపాదించుకోవచ్చన్న ఏకైక లక్ష్యంతో అన్నాడీఎంకే నేతలంతా శశికళకు జైకొడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.