Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడు సీఎంగా శశికళ ఎన్నిక... అన్నాడీఎంకే నేతల లోగుట్టు కథ ఇదే...

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (16:16 IST)

Widgets Magazine
sasikala

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను అన్నాడీఎంకే నేతలంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గల కారణాలపై వివిధ రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్నంతకాలం కింది స్థాయి కార్యకర్త నుంచి కేబినెట్ ర్యాంక్ మంత్రి వరకు బిక్కుబిక్కుమంటూ పార్టీలో కొనసాగారు. ముఖ్యంగా మంత్రులంతా తెల్లవారేసరికి మంత్రి పదవుల్లో ఉంటామో లేదోనన్న భయంతోనే గడిపారు. 
 
అయితే, జయలలిత మరణం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు బందీలుగా ఉన్న ఏడీఎంకే నేతలు.. జయ మరణం తర్వాత తమకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందన్న చందంగా ఉన్నారు. అదేసమయంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలను శశికళ చేపట్టారు. ఇంతలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె సమ్మతించి ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించారు. దీంతో శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకోగా ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు ఝులక్ ఇచ్చారు. 
 
ఇదిలావున్నప్పటికీ.. శశికళను ఉన్నఫళంగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి గల ప్రధాన కారణం. జయలలిత జీవించివున్నంత వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏడీఎంకే నేతలకు జేబులు ఖాళీ అయ్యాయేగానీ.. ఎక్కడా కూడా తమ ప్యాకెట్లను నింపుకోలేక పోయారు. ఏమాత్రం చిన్నపాటి ఆరోపణ వచ్చినా... ఆ మరుక్షణమే ఆ మంత్రి లేదా ఎమ్మెల్యే లేదా నేతపై వేటు వేసేవారు. 
 
కానీ, జయలలిత మరణించిన తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. శశికళకు జైకొట్టి... వంగివంగి నమస్కారం చేయడం వల్ల తమ పనులు చక్కబెట్టుకోవచ్చన్నది నేతలు అభిప్రాయంగా ఉంది. పైగా ఇక భవిష్యత్‌లో జరిగే ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేదు. అంటే ఇంతటితో తమ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాఫ్‌పడటం ఖాయమని భావిస్తున్నారు. దీంతో 2021 వరకు ఇష్టానుసారంగా రెండు చేతులా సంపాదించుకోవచ్చన్న ఏకైక లక్ష్యంతో అన్నాడీఎంకే నేతలంతా శశికళకు జైకొడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శోభన్ బాబు - జయలలిత మరణాలు ఒకే రీతిలో జరిగాయా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న చర్చను చూస్తుంటే ...

news

శశికళ వర్సెస్ శశికళ.. ప్రధానికి వరుసబెట్టి లేఖలు.. అమ్మను కిందకు తోసింది ఎవరు?

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ లేఖలో ...

news

'ప్రజాస్వామ్యం మరణించింది.. నా ఓటు నీకు కాదు'.. శశికళపై బ్రేవ్ గర్ల్ సాంగ్ (Video)

తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ...

news

శశికళ సీఎం కాగానే రామ్మోహన్ రావు మళ్లీ సీఎస్ అవుతారా?

తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా అన్న డైలమాలో ఉండగానే ఆమె పట్ల ...

Widgets Magazine