గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 1 డిశెంబరు 2016 (12:03 IST)

'నాడా' బడా కాదు... బలహీనం, చెన్నైకు 350 కి.మీ దూరంలో....

చెన్నై: డిసెంబరులో చెన్నైలో వానలు అంటే చెన్నైవాసి గుండె దడదడ కొట్టుకుంటుంది. ఎందుకంటే గత ఏడాది కూడా డిసెంబరు నెలలోనే చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపధ్యంలో నాడా ఏమయినా తేడా చేస్తుందేమోనని అంతా భయపడ్డారు. కానీ నాడా తుఫానుకు అంత సీనులేదట.

చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న నాడా తుఫాను క్రమంగా బలహీనపడి కడలూర్ వద్ద శుక్రవారం తీరాన్ని దాటుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఐతే తీరం దాటిన తర్వాత మూడు లేదా నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. నేవీ హెలికాప్టర్లను సిద్ధం చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.