శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (09:48 IST)

ధనవంతులకు ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీ కట్!

దేశంలోని ధనవంతులకు ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీని తొలగించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కొందరు హర్షించినా, వ్యతిరేకించినా దేశ శ్రేయస్సు కోసం అతి ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పదని ఆయన అన్నారు. 
 
ఈ విషయమై ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ... ఎల్పీజీ సబ్సిడీ తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకోగలిగితే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా అతి సులభంగా పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
గత ప్రభుత్వాలు గ్యాస్, డీజిల్ తదితర సమస్యలపై సరైన దృష్టి సారించలేదని, తమ ప్రభుత్వం మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకుంటుందని అరుణ్‌జైట్లీ తెలిపారు.