Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దేవుడెపుడు శాసిస్తాడో.. రజనీకాంత్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారో?

శుక్రవారం, 19 మే 2017 (10:02 IST)

Widgets Magazine

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. రాజకీయాలపై అభిమానుల కోసం జరిగిన సమావేశంలో మాట్లాడిన సూపర్ స్టార్ రజనీకాంత్.. తన రాజకీయ అరంగేట్రం ఎప్పుడుటుందని మాత్రం స్పష్టం చేయలేదు. ఇంకా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తన వద్ద అడగొద్దని రజనీకాంత్ దాటవేశారు.

తన జీవితం దేవుడి చేతుల్లోనే ఉందని.. ఆయన తన తలరాతను ఎలా రాశారో తనకు తెలియదన్నారు. కానీ దేవుడు తనపై ఉంచిన బాధ్యతలను మాత్రం తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి రానంత మాత్రాన అభిమానులు నిరాశకు గురికావద్దని రజనీ సూచించారు. 
 
ఇంకా 4 దశాబ్ధాలు తమిళనాడులో ఉన్నానని.. తాను తమిళుడినేనని రజనీకాంత్ స్పష్టం చేశారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తిరుచ్చి, అర్యళూరు, తిరంబళూర్ జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమైన సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు.

విమర్శలు సర్వసాధారణమని రజనీ తీసిపారేశారు. మన వ్యవస్థలో లోపాలున్నాయన్నారు. చెడు రాజకీయ నేతలతో పాటు నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యం చెడిపోయిందని.. అందరూ కలిసి పనిచేస్తేనే దేశం బాగుపడుతుందని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యుద్ధ మేఘాలు : ఉత్తర కొరియాపై దాడికి కదిలిన యుఎస్ వార్ షిప్?

అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఉత్తర కొరియా ధిక్కార ...

news

40 యేళ్ళుగా తమిళనాడులో ఉంటున్నా.. నేను తమిళుడిని కాదా? రజనీకాంత్

తాను తమిళుడుకాదంటూ బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామితో పాటు ...

news

ఆన్‌లైన్‌లో అన్నాడీఎంకే మహిళా ఎంపీ అశ్లీల ఫోటో... ఢిల్లీ పోలీసుల కేసు

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పను అశ్లీలంగా చూపిస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ...

news

నిషిత్ కారు ప్రమాదం: ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు పగిలాయి?... బెంజ్ ప్రతినిధులు ఏమంటున్నారు?

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ...

Widgets Magazine