శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (09:05 IST)

సీఎంగా పన్నీరు సెల్వం ఉండాలా.. శశికళ ఉండాలా.. వెంకయ్య ఏం సలహా ఇచ్చారు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మరణం తర్వాత ఆ బాధ్యతలను ఆమె నమ్మినబంటు ఓ.పన్నీర్ సెల్వం చేపట్టారు. ఇపుడు ఆ బాధ్యతలు తనకు అప్పగించాలంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు స్వీకరించిన జయలలిత ప్ర

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మరణం తర్వాత ఆ బాధ్యతలను ఆమె నమ్మినబంటు ఓ.పన్నీర్ సెల్వం చేపట్టారు. ఇపుడు ఆ బాధ్యతలు తనకు అప్పగించాలంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు స్వీకరించిన జయలలిత ప్రియనెచ్చెలి శశికళ కోరుతున్నట్టు సమాచారం. ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం చెన్నైకు వచ్చారు. ఇండియా టుడే గ్రూపు నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
 
తాము రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. అయితే, ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం వుండాలా, శశికళా వుండాలా అన్నది అన్నాడీఎంకే నిర్ణయిస్తుందని, ఆ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టంచేశారు. ఎవరి పార్టీ అభివృద్ధికి వారు ప్రయత్నిస్తుంటారని, తాము కూడా అదేవిధంగా తమ పార్టీ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటామన్నారు. తమిళనాడు సీఎంతో సత్సంబంధాలున్నాయని, ఆయనకు అన్ని విధాలుగానూ సహకరిస్తున్నామన్నారు.
 
తమిళనాడులో డీఎంకే- అన్నాడీఎంకేలు ఎంతో దృఢంగా వున్నాయన్నారు. డీఎంకేలో నాయకుడు ఉన్నారని, అన్నాడీఎంకేలో జయలలిత మరణించినప్పటికీ ఆ పార్టీ ఇంటింటికీ విస్తరించి వుందన్నారు. తమిళులు డీఎంకే-అన్నాడీఎంకేలకే వంతులవారీగా ఓట్లు వేస్తున్నారన్నారు. బీజేపీ ఎలాగూ అధికారం చేపట్టలేదన్న ఉద్దేశంతో తమ పార్టీ సానుభూతిపరులు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. 
 
అయితే ప్రస్తుతం ప్రజల ఆలోచనా తీరు మారుతోందన్నారు. తాము కాంగ్రెస్‌, వామపక్షాలతో తప్ప అందరితోనూ కలసి పని చేశామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కేరళలో తమపార్టీ పుంజుకుంటుందన్నారు. అక్కడ కాంగ్రెస్‌-వామపక్షాలు పరస్పరం తలపడుతున్నందున తమ పార్టీ బలపడుతుందన్నారు. ఇకపోతే.. జల్లికట్టు పోటీల నిర్వహణపై కేంద్రం నిర్ణయం వెల్లడించేందుకు సిద్ధంగా ఉందనీ, ఈ అంశం కోర్టులో ఉందని చెప్పారు.