శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (12:46 IST)

ఆల్ట్రాసౌండ్ స్కాన్‌లో కనిపించిన కవలలు.. ఆపరేషన్ చేసి ఒక్క బిడ్డనే తీసిన వైద్యులు!

గర్భిణి మహిళను పరిక్షించిన వైద్యులు ఆమెకు కవల పిల్లలు పుడతారని చెప్పి తీరా డెలివరీ అయ్యాక ఒక బిడ్డనే చేతికిచ్చిన ఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన 23 ఏ

గర్భిణి మహిళను పరిక్షించిన వైద్యులు ఆమెకు కవల పిల్లలు పుడతారని చెప్పి తీరా డెలివరీ అయ్యాక ఒక బిడ్డనే చేతికిచ్చిన ఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన 23 ఏళ్ల సంగీతాదేవి ఈ నెల 20న పురిటినొప్పులతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఆమెకు పురుడు పోసిన వైద్యులు ఒకే ఒక బిడ్డను చేతికిచ్చారు. అయితే.. డెలివరీకి ముందు కవలపిల్లలను పుడతారని వైద్యులు చెప్పారని.. ఇప్పుడు ఒక బిడ్డనే ఇచ్చారని సంగీత ఆవేదన వ్యక్తం చేసింది.
 
ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించినప్పుడు తన గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వైద్యులు చెప్పారని చెప్పింది. అంతేకాక కవల పిల్లల వల్ల తనకు సహజ ప్రసవం అవ్వడం కష్టమని.. శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్లు తమ వద్ద సంతకం కూడా తీసుకున్నారని వాపోయింది. 
 
ఇదిలావుంటే.. .తమ బిడ్డను ఆసుపత్రి యాజమాన్యమే తీసుకుందని సంగీత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ... ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన ఆసుపత్రి చీఫ్‌ సూపరిండెంట్‌.. ఘటనపై విచారణకు ఆదేశించారు.