శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (16:54 IST)

ముకేష్ అంబానీ ఇంట పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికి? నిషాకా.. మేనకోడలికా?

భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది. గత రెండు రోజులుగా ముకేష్ అంబానీల గారాల పట్టి నిషా త్వరలో పెళ్ళికూతురు కాబోతోంది. నవంబరులో అమ్మడు పెళ్లి అట్టహాసంగా జరుగనుందన

భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది. గత రెండు రోజులుగా ముకేష్ అంబానీల గారాల పట్టి నిషా త్వరలో పెళ్ళికూతురు కాబోతోంది. నవంబరులో అమ్మడు పెళ్లి అట్టహాసంగా జరుగనుందని సమాచారం. 24 ఏళ్ల నిషా ప్రేమలో ఉందని అమ్మడు ప్రేమకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించిందని టాక్. అయితే ముకేష్ అంబానీ కుమార్తెకు పెళ్లి జరగట్లేదని, అతని మేనకోడలికే వివాహం నిశ్చయమైనట్లు వార్తలొస్తున్నాయి. 
 
వీటిలో ఏది నిజమో అనేది సస్పెన్స్. పూర్తి వివరాలు స్పష్టంగా తెలియకుండానే నిషా పెళ్ళికి అంతా సిద్ధమైందని భారత్‌లో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో అట్టహాసంగా వివాహం చేయనున్నట్లు ఓ జాతీయ పత్రిక వెల్లడించింది. ఈ పెళ్లికి షారూఖ్ తోపాటు పలువురు సెలబ్రిటీలతో సంగీత్ కార్యక్రమం ఏర్పాటు కానుందని తెలిసింది. మరి ఈ వార్తలపై ముకేష్ నోరు విప్పితే గానీ అసలు విషయం తెలియదు.