Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఓ. పన్నీర్ సెల్వం ప్రస్థానం ఇదీ... సాధారణ కార్యకర్త నుంచి సీఎం వరకు..

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (09:34 IST)

Widgets Magazine
opanneer

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఓ.పన్నీర్ సెల్వం రాజకీయ ప్రస్థానం ఓ సాధారణ కార్యకర్తగా ప్రారంభమైంది. 1977లో అన్నాడీఎంకేలో సభ్యత్వం తీసుకున్న పన్నీర్ సెల్వం... 1980లో పెరియకులం 18వ వార్డు కమిటీ ప్రతినిధిగా నియమితులయ్యారు. 1984లో పెరియకులం 18వ వార్డు కార్యదర్శిగా, 1993లో పెరియకులం పట్టణ కార్యదర్శిగా, 1996లో పెరియకుళం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పని చేశారు. 
 
1997లో తేని జిల్లా ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శిగా, 1998లో పెరియకులం పట్టణ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2000లో జిల్లా పార్టీ కార్యదర్శిగా, 2001లో ఎమ్మెల్యేగా, రెవెన్యూ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2002లో ప్రజాపనుల శాఖ, రెవెన్యూ శాఖామంత్రిగా పని చేశారు. 2004లో పార్టీ ఎన్నికల విభాగం కార్యదర్శిగా, 2006లో ఎమ్మెల్యే, శాసనసభలో విపక్ష నేతగా, విపక్ష ఉప నేతగా, 2007లో పార్టీ కోశాధికారిగా కొనసాగారు. 2011లో బోడినాయకనూర్‌ ఎమ్మెల్యేగా, ఆర్థిక మంత్రిగా, 2014లో ముఖ్యమంత్రిగా, 2015లో ఆర్థిక మంత్రిగా, 2016లో మళ్లీ బోడినాయకనూర్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2016 డిసెంబర్ 6 నుంచి 2017 ఫిబ్రవరి 5వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 
 
ఇదీ శశికళ నేపథ్యం... 
1984లో జయలలితతో పరిచయం
1985లో పోయెస్ గార్డెన్‌లో జయలలితకు సహాయకురిలిగా ప్రవేశం. 
2011లో పోయెస్ గార్డెన్ నుంచి గెంటివేత, పార్టీ సభ్యత్వం నుంచి తొలగింపు.
2012లోక్షమాపణ కోరుతూ జయకు లేఖ.. మళ్లీ పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి. 
2016 డిసెంబర్ 29న పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం. 
2017 ఫిబ్రవరి 5న అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపిక. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాంబు పేల్చిన పన్నీర్ సెల్వం... అమ్మ మృతికి కారణం ఎవరో నాకు తెలుసు

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి దివంగత జయలలిత ...

news

'పన్నీర్'కు శశికళ అండ... ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలి... పెరుగుతున్న నేతల మద్దతు

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంకు శశికళ మద్దతు ప్రకటించారు. శశికళ అంటే.. ఆ ...

news

శశికళ గుట్టు బయటపెడతా... 10 శాతమే వెల్లడించా.. ఇంకా 90 శాతం ఉన్నాయ్ : పన్నీర్ సెల్వం

అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళ గుట్టును బహిర్గతం చేస్తానని తమిళనాడు ఆపద్ధర్మ ...

news

హీటెక్కిన తమిళ రాజకీయాలు.. ఓపీ వర్సెస్ శశికళ.. రాష్ట్రానికి గవర్నర్ వచ్చేస్తున్నారా?

తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ ...

Widgets Magazine