శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2017 (13:52 IST)

ఆర్కే నగర్ ఉప ఎన్నికలు: ఓపీఎస్ అష్టోత్తర శత హామీలు-దేశంలోనే తొలి ఎమ్మెల్యే ఆఫీస్

తమిళనాట ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకీ హీటెక్కుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన నేతలు వర్గాలుగా చీలిపోయి ఆర్కేనగర్ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్కే

తమిళనాట ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకీ హీటెక్కుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన నేతలు వర్గాలుగా చీలిపోయి ఆర్కేనగర్ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు ఓపీఎస్ వర్గం శతవిధాలా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా అష్టోత్తర శత హామీలను ఓటర్లకు వరాలుగా ఇచ్చింది.
 
ఆర్కే నగర్ ఎన్నికల్లో ఓపీఎస్ వర్గం అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ పార్టీ పేరుతో మధుసూదన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్క నియోజకవర్గం కోసం 108 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంపై.. ఓపీఎస్ వర్గానికి విజయం ఖాయమని రాజకీయ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. 
 
ఇంతటి ఆగకుండా ఇప్పటి దాకా దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి మొబైల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఓపీఎస్ ప్రకటించారు. స్థానిక తండయారుపేటలోని పార్టీ నూతన కార్యాలయంలో గురువారం మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ఓపీఎస్ మాట్లాడుతూ.. ఆర్కే నగర్ అభివృద్ధికి ఆవశ్యమైన అంశాలనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలిపారు. కాగా ఆర్కేనగర్ ఎన్నికలు ఏప్రిల్ 12వ తేదీ జరుగనుండగా.. పోలింగ్ జరిగిన మూడు రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఎన్నికల ఫలితాలు ఓపీఎస్, శశికళ వర్గంతో పాటు జయలలిత మేనకోడలు దీపకు కీలకం కానున్నాయి.