Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిన్నమ్మ సీఎం అయితే జల్లికట్టు తరహా పోరాటానికి సై: విద్యార్థి సంఘాలు

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:51 IST)

Widgets Magazine

తమిళనాడు సీఎం పీఠంపై కన్నేసిన శశికళకు వ్యతిరేకంగా రాష్ట్ర యువత పోరుకు సై అంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ శశికళశ బాధ్యతలను స్వీకరిస్తే.. మెరీనా బీచ్ వేదికగా మరో ఉద్యమం రాజుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
అమ్మ మరణం తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో శశికళపై పన్నీర్ సెల్వం సమరం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు ఇప్పటికే సోషల్ మీడియాలో లక్షలాది మంది యువకులు మద్దతు ఇచ్చారు. కానీ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని శశికళ ప్రయత్నిస్తే మెరీనా వేదికగా మరో ఉద్యమం చేపట్టాలని తమిళనాడులోని పలు విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. 
 
తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం ఏలా పోరాటం చేశామో అలాగే సమర్థవంతమైన సీఎం కోసం మళ్లీ పోరాటం చెయ్యడానికి సిద్ధమని వారు చెప్తున్నారు. ఇప్పటికే శశికళ సీఎం కావడాన్ని సోషల్ మీడియాలో తప్పుపడుతూ వస్తున్న యువత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. శశికళ కేవలం అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని తీరికలేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే పరిణామాలు వేరుగా ఉంటాయని తమిళనాడుకు చెందిన యువకులు, విద్యార్థులు సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకు మరో ఎదురుదెబ్బ... పన్నీర్‌కు జై కొట్టిన ప్రిసీడియం ఛైర్మన్.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ...

news

శశికళకు ముచ్చెమటలు.. జారుకుంటున్న ఎమ్మెల్యేలు... మా వాళ్లను పన్నీర్ కొనేస్తున్నారంటూ గగ్గోలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు ముచ్చెమటలు పడుతున్నాయి. బుధవారం రాత్రి వరకు తన ...

news

శశిపై పన్నీర్ సర్జికల్ స్ట్రైక్స్.. ఎమ్మెల్యేలు ఎక్కడున్నా పట్టుకురండి.. డీజీపీకి ఆదేశాలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు.. తమిళనాడు ఆపద్ధర్మ ...

news

శశికళ సీఎం కాకుండా అడ్డుకోండి : ఒకే.. రేపు విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఒక ...

Widgets Magazine