శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (10:23 IST)

జయలలిత సమాధి సాక్షిగా అన్నాడీఎంకే పొలిటికల్ డ్రామా.. పన్నీర్ వర్సెస్ శశికళ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి సాక్షిగా అన్నాడీఎంకే రాజకీయాలు సాగుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి జయ సమాధి వద్ద 40 నిమిషాల పాటు ధ్యానం చేసి.. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి సాక్షిగా అన్నాడీఎంకే రాజకీయాలు సాగుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి జయ సమాధి వద్ద 40 నిమిషాల పాటు ధ్యానం చేసి.. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో అన్నాడీఎంకేలో రాజకీయ చిచ్చు మొదలైంది. అలాగే, బుధవారం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ జయలలిత సమాధివద్దకు వెళ్లనున్నారు. అక్కడ పుష్పాంజలి ఘటిస్తారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, పన్నీర్ సెల్వం మినహా మిగతా ఎమ్మెల్యేలు అంతా శశికళ పక్షాన్నే ఉన్నారని అన్నాడీఎంకే పేర్కొంది. అయితే సెల్వం పక్షాన 22 మంది ఎమ్మేల్యేలు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా నిన్న మొదలైన హై డ్రామా బుధవారం కూడా కొనసాగుతోంది. క్షణ..క్షణం ఉత్కంఠ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అన్నాడీఎంకే కార్యాలయం వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. అలాగే, కార్యకర్తలు, నేతల రాకతో పన్నీర్ సెల్వం నివాసం కూడా సందడిగా మారింది. 
 
ఈ నేపథ్యంలో శశికళ బుధవారం ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. సెల్వం తిరుగుబాటు, తదనంతర పరిణామాలపై ఆమె చర్చలు జరపనున్నారు. శశికళ, పన్నీర్ సెల్వం గ్రూపులుగా పార్టీ కార్యకర్తలు విడిపోవడంతో పరిస్థితి అదుపుతప్పకుండా అక్కడ భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. 
 
తమవైపు 134 మంది శాసనసభ్యులున్నారని లోక్‌సభ ఉప సభాపతి, సీనియర్ ఎంపీ తంబిదురై వెల్లడించారు. పన్నీర్‌ సెల్వం పార్టీకి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఈ కుట్ర వెనుక డీఎంకే హస్తముందన్నారు. శశికళనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. డీఎంకే మద్దతుతోనే పన్నీర్‌ సెల్వం ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఆయనను బెదిరించి రాజీనామా చేయించారన్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.