Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశి క్యాంప్ నుంచి ఎస్కేప్.. పన్నీర్‌ను కౌగిలించుకుని.. ముద్దుపెట్టుకుని.. ఏడ్చేసిన?

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (11:10 IST)

Widgets Magazine

తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. గవర్నర్ విద్యాసాగర్ మౌనం వహించడంతో పన్నీర్ సెల్వం శశికళ మధ్య వార్ తారాస్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శశికళ వర్గం నుంచి పన్నీర్ క్యాంపుకు చేరుకునే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. తాజాగా మూడు రోజుల పాటు శశికళ వర్గంలో ఉండి, ఆపై తప్పించుకు వచ్చిన ఎమ్మెల్యే ఒకరు, పన్నీర్ సెల్వం ఇంటికి వచ్చి ఆయన్ను కౌగిలించుకుని, ముద్దు పెట్టి ఏడ్చారు. 
 
తమను బలవంతంగా శశి క్యాంపుకు తీసుకెళ్లారని ఆరోపించారు. శశికళ శిబిరంలోని చాలా మంది ఎమ్మెల్యేలకు అక్కడ ఉండటం ఇష్టం లేదని, తప్పించుకు వచ్చేందుకు మార్గాలను వెదుకుతున్నారని తెలిపారు. వారందరినీ బయటకు తెప్పించాలని కోరారు. కాగా, తనకే సీఎంగా అవకాశం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న పన్నీర్ సెల్వం, సోమవారం ఉదయం నుంచి తనను కలిసేందుకు వస్తున్న సీనియర్ నేతలు, సినీ నటులు, అభిమానులతో మాట్లాడుతూ బిజీగా గడుపుతున్నారు.
 
మరోవైపు గవర్నర్ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించక పోవడాన్ని శశికళ వర్గం జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోమవారం సాయంత్రం 4 గంటల వరకూ సమయం ఇచ్చిన శశికళ, ఆపై తన సత్తా చూపిస్తానని హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై అంతటా హై అలర్ట్ ప్రకటించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడులో సీఎం పోస్ట్ ఖాళీ లేదు.. అక్కడ ప్రభుత్వం ఉంది: వెంకయ్య

తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని, అక్కడ ముఖ్యమంత్రి అధినేతగా ఉన్న ప్రభుత్వం ఉందని ...

news

వరసకు సోదరుడు.. అయినా వేధిస్తున్నాడు.. ఇక తాళలేను.. చెరువులో దూకేస్తున్నా..

బాలికలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కామాంధులు చిన్నారులపై కూడా ...

news

ప్రేమ విఫలం.. బైక్ దొంగలించారని కేసు పెట్టారు.. పురుగుల మందు తాగేశాడు..

నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా ...

news

పర్మనెంట్ గవర్నర్ లేదు.. గవర్నమెంటూ లేదు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు: విజయ్‌కాంత్

డెల్టా జిల్లాల్లో రైతులు పంట నష్టాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. స్థిరమైన ప్రభుత్వం ...

Widgets Magazine