Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆన్‌లైన్ సర్వేలో పన్నీర్ సెల్వందే విజయం.. నటరాజన్ అపోలోలో ఏం చేస్తున్నారు?

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:49 IST)

Widgets Magazine
sasikala - natarajan

జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో 95శాతం మంది పన్నీర్‌సెల్వంకే మద్దతు తెలిపారు.

పన్నీర్ సెల్వమే తమిళనాడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు. 'సీఎంవో తమిళనాడు' పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్‌సెల్వం ట్విట్టర్ ఖాతాలో వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 60వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. తమిళనాట రాజకీయ సమీకరణాలు గంట గంటకూ మారిపోతున్నాయి. ఇదంతా నడిపించేది.. శశికళ భర్త నటరాజన్ అందరూ భావిస్తారు. ఇంత హడావిడి నడుస్తుంటే నటరాజన్ మాత్రం కనబడట్లేదు. నిజానికి హైడ్రామా మధ్యన అన్నాడీఎంకే శాసనపక్షనేతగా శశికళ ఎన్నికయ్యారు. ఇంకా చెప్పాలంటే ఓవైపు శాసనపక్షనేతగా ఎన్నికైన రోజే ఆమె భర్త నటరాజన్ తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. అమ్మ చికిత్స పొందిన ఆస్పత్రిలోనే నటరాజన్‌ను కూడా చేర్చారని విశ్వసనీయవర్గాల సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రేమకు నో చెప్పింది.. యాసిడ్‌ను ముఖంపై పోసేశాడు..

ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కోపంతో ఓ యువతిపై యాసిడ్ దాడికి ...

news

శశిని సీఎం చేస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని అమ్మేస్తుంది : టి రాజేందర్

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను నియమిస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని ...

news

తమిళనాడుకు ఇదేమి కొత్తకాదు.. మంచి నిర్ణయమే తీసుకుంటారు : కె. రోశయ్య

తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభం వంటి సంఘటనలు కొత్తేమి కాదని ...

news

రెండు రోజుల్లో శశికళ కథ సమాప్తం : సీఎం పన్నీర్ వర్గం నేత పాండ్యన్

తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం బలం పెరుగుతోంది. ఈ క్రమంలో, పన్నీర్ సెల్వం వర్గానికి ...

Widgets Magazine