శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (13:56 IST)

ఖాకీలపై చర్య తీసుకోవాలి లేదంటే.. పాలు, కూరగాయల సరఫరా నిలిపివేస్తాం : హర్దిక్ పటేల్

పటీదార్ అనామత్ ఆందోళన సమితి (పీఏఏఎస్)కి చెందిన ఉద్యమకారులపై లాఠీ చార్జ్ చేసి, కాల్పులు జరిపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోకుంటే పాలు, కూరగాయల సరఫరా నిలిపివేస్తామని పాస్ కన్వీనర్ హర్దిక్ పటేల్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి ఇప్పటికే వార్నింగ్ ఇవ్వగా, ప్రభుత్వం మాత్రం మెతకవైఖరిని అవలంభిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
గుజరాత్ రాష్ట్రానికి చెందిన పటేల్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయంతెల్సిందే. ఈ ఆందోళలు విశ్వరూపం దాల్చి హింస ప్రజ్వరిల్లింది. ముఖ్యంగా జీఎండీసీ మైదానంలో మహిళలు, చిన్నారులతో పాటు.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా పోలీసులు లాఠీ‌చార్జ్ చేశారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హింసాత్మక చర్యల్లో పది మంది వరకు ఆందోళనకారులు చనిపోయారు. దీనిపై హర్దిక్ పటేల్ మండిపడుతున్నారు. 
 
లాఠీచార్జ్ చేసిన పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోకుంటే పాలు, కూరగాయల సరఫరాను నిలిపివేస్తామని, ఈ చర్య కేవలం గుజరాత్ రాష్ట్రంలోనే కాకుండా, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలపై ప్రభావం చూపుతుందని హర్దిక్ పటేల్ ప్రకటించారు. పైగా గుజరాత్ రాష్ట్రంలోని అనేక సహకార డైరీలు పటేల్ సామాజికవర్గానికించిన చెందిన వ్యక్తుల చేతిలో ఉన్నాయనే విషయాన్ని గుజరాత్ సర్కారు విస్మరించదాని గుర్తుచేశారు. అంతేకాకుండా, హింసాత్మక చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని హర్దిక్ పటేల్ డిమాండ్ చేస్తున్నారు.