ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించలేదు.. అంతే ఆ టెక్కీ ప్రియుడితో కలిసి ఏం చేసిందంటే?

murder
Last Updated: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (20:19 IST)
ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించలేదని.. తన ప్రియురాలితో కలిసి క్రికెటర్ అఖ్లాక్ రెండు హత్యలకు పాల్పడ్డాడు. ఇందుకోసం తన ప్రియురాలి తల్లిదండ్రులను హత్య చేశాడు.


వివరాల్లోకి శంకర్ చంపటి (72), సీమా (64) వారి ఇంట్లోనే బలమైన గాయాలతో రక్తపు మడుగులో విగత జీవులుగా కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై చంపటి కుమార్తెను అదుపులోకి తీసుకుని విచారణ జరపడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఆదివారం పూట ఈ వృద్ధ దంపతులు హత్యకు గురైయ్యారు. 
 
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దంపతుల కుమార్తె, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వద్ద విచారణ జరిపారు. ఈ విచారణలో మహ్మద్ అఖ్లాక్‌కు ఆమె ప్రేమించిందని తెలిసింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే..వారు ఒప్పుకోలేదని... వెల్లడి అయ్యింది. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని భావించిన ప్రియాంక, తన ప్రియుడి సాయాన్ని కోరింది. 
 
హత్యకు ముందు వారు తినే ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి, ఆపై తలపై మోది వారిని హత్య చేశారు. వీరిద్దరూ తాము చేసిన దారుణాన్ని అంగీకరించారని పోలీసులు వెల్లడించారు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలించామని చెప్పారు.దీనిపై మరింత చదవండి :