Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కబ్జాదారులు గెంటేశారు... పంచాయతీ వత్తాసు పలికింది... మోడీజీ న్యాయం చేయండి

శనివారం, 10 జూన్ 2017 (09:09 IST)

Widgets Magazine
girl letter

కబ్జాదారుల కారణంగా ఉన్న ఇంటిని కోల్పోయిన ఓ 11 యేళ్ల బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. తమ ఇంటిని కబ్జాదారులు స్వాధీనం చేసుకుని ఇంటిని నిర్మిస్తుంటే గ్రామ పంచాయతీ పెద్దలు వత్తాసు పలుకుతున్నారనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదనీ, అందువల్ల తమకు న్యాయం చేయాలంటూ ఆ బాలిక ప్రధాని మోడీకి లేఖ రాసింది.
 
ఒడిషా రాష్ట్రంలోని కటక్ జిల్లాలోని పోఖరి గ్రామానికి చెందిన ఉగ్రసేన్ మొహరానా కుమార్తె శుభశ్రీ రాసిన లేఖలోని వివరాలను పరిశీలిస్తే.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరింది. ఏ తప్పు చేయకుండానే తమను ఇంటి నుంచి బలవంతంగా బయటకు పంపారని, తిరిగి ఇంటికి చేరుకునేందుకు సాయం చేయాలని లేఖలో కోరింది.
 
గ్రామస్థులు తన తండ్రిపై దాడి చేయడమే కాకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని ఆవేదన వ్యక్తంచేసింది. తమ భూమిని అన్యాయంగా లాక్కునేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నందుకే తమపై కక్ష కట్టారని వివరించింది. కబ్జాదారులకు గ్రామ పంచాయతీ పెద్దలు సైతం వత్తాసు పలికారని, దీనిపై డీజీపీ కేబీ సింగ్, ఇతర ఉన్నతాధికారులను కలిసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో ప్రధానికి లేఖ రాసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రుణం కావాలా? అయితే, ష్యూరిటీగా నగ్న ఫోటోలు ఇవ్వాలి... ఏ కంపెనీలో?

సాధారణంగా రుణం కావాలంటే ఏదేని సెక్యూరిటీ (ష్యూరిటీ) ఇవ్వాల్సి ఉంటుంది. అది ఉద్యోగి ...

news

లోన కత్తులు నూరుతున్నా.. దాయాది దేశాల ప్రధానులు దౌత్య భాషలో ఇలా మాట్లాడాల్సిందే...

గత సంవత్సరం ప్రారంభంలో పఠాన్ కోట్ సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముష్కరులు జరిపిన ...

news

బ్రిటన్ పార్లమెంటుకు సిక్కుమహిళ ఎంపిక: కనీస మెజారిటీ కూడా రాని ప్రధాని.. హంగ్ పార్లమెంట్

బ్రిటన్‌ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్‌ పార్టీకి ...

news

ఎటీఎం ఇవ్వదు.. బ్యాంకులోంచి రాదు.. చార్జీల మోత భయంతో బ్యాంకుల్లో డబ్బు ఖాళీ

బ్యాంకుల్లో డబ్బులు జమ చేసినా, డ్రా చేసినా కూడా చార్జీల మోత మోగిపోతుందనే ప్రచార భయంతో ...

Widgets Magazine