గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2016 (11:23 IST)

సైకిళ్లపై గస్తీ వద్దే వద్దు.. దొంగలు కార్లు, బైకుల్లో వెళ్తే మేమెలా పట్టుకునేది?!

తమిళనాట పోలీసులకు సైకిళ్లపై గస్తీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 30న సీఎం జయలలిత గస్తీ చేపట్టేందుకు పోలీసులకు సైకిళ్లను అందచేశారు. అయితే ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. సైకిళ్లను వ

తమిళనాట పోలీసులకు సైకిళ్లపై గస్తీ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 30న సీఎం జయలలిత గస్తీ చేపట్టేందుకు పోలీసులకు సైకిళ్లను అందచేశారు. అయితే ఈ పథకం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. సైకిళ్లను వాడేందుకు అధిక భాగం పోలీసులు ఇష్టపడడం లేదు. తమ సొంత బైకులు, ప్రభుత్వం అందించిన జీపులు, ప్రత్యేక బైకుల్లోనే గస్తీ తిరుగుతున్నారు. 
 
సైకిళ్లపై తిరగడం 25 ఏళ్ల క్రితం నాటి పద్ధతని, ఆ రోజుల్లో వాహనాలు అందుబాటులో లేక వాటినే వినియోగించామని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని పోలీసులు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే దొంగలు, హత్యలకు పాల్పడే వారు ఆధునిక సాంకేతిక పద్ధతులు పాటిస్తూ.. వేగంగా తప్పించుకుంటుంటే.. వారు బైక్‌లు, కార్లను వినియోగిస్తుంటే సైకిళ్లను ఉపయోగించే తాము వారిని ఎలా పట్టుకుంటామని చెప్తున్నారు. 
 
వయసు పైబడి, లావుగా ఉండే పోలీసులు మాత్రం అస్సలు సైకిళ్ల గస్తీ వద్దనే వద్దంటున్నారు. సైకిల్‌ ప్రయాణం చక్కటి వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది కదా అంటే మాత్రం పోలీసులు నోరుమెదపట్లేదు. అయితే వేగం విషయానికి వస్తే మాత్రం పోలీసులు సైకిళ్లు వద్దే వద్దంటున్నారు.