శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (11:11 IST)

భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంధి కుదిరిందా? ఎప్పుడు? ఆ ఫైల్‌లో ఏముంది?

భారత్-పాకిస్థాన్‌ల మధ్య గతంలో సంధి కుదిరిందని తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య గల కాశ్మీర్‌పై నెలకొన్న వివాదానికి స్వస్తి పలికేలా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఒకప్పటి పాక్ నియంత, ఆపై అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జనరల్ పర్వేష్ ముషారఫ్‌ మధ్య చర్చలు జరిగాయని సమాచారం. ఈ క్రమంలో ముసాయిదా కూడా సిద్ధమైందని, ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వార్త ఈ అంశాలను నిజమని తేల్చింది. అంతేగాకుండా ఓ భారత దౌత్యాధికారి కూడా ఇదంతా జరిగిందని ధ్రువీకరించినట్లు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్.. పర్వేజ్ ముషారఫ్‌ల మధ్య రహస్య చర్చలు జరిగాయని.. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అందుకు సంబంధించిన సీక్రెట్ ఫైల్‌ను మన్మోహన్ సింగ్ స్వయంగా మోడీకి అందించారని ఆ పత్రిక పేర్కొంది. గత ఏడాది మే 27న మన్మోహన్ సింగ్ స్వయంగా ఆ ఫైల్‌ను మోడీకి అందించారని.. ఈ ఫైల్‌లో జమ్మూ కాశ్మీర్ అంశానికి సరైన పరిష్కారం ఉన్నట్లు ఆ పత్రిక ప్రచురించింది.