Widgets Magazine Widgets Magazine

పెద్ద నోట్ల రద్దు దెబ్బ కాదు.. వాన్నా క్రై వైరస్ దెబ్బ.. దేశవ్యాప్తంగా ఏటీఎమ్‌ల మూసివేత

హైదరాబాద్, సోమవారం, 15 మే 2017 (08:38 IST)

Widgets Magazine
axis bank

పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటికీ దేశంలో 60 నుంచి 75 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. ఇప్పుడు పుండు మీద కారం లాగా ప్రపంచ వైరస్‌లకు అమ్మలాంటి  వాన్నా క్రై వైరస్‌ దెబ్బకు మిగిలిన  ఎంటీఎంలు కూడా మూసివేతకు గురయ్యాయి. విండోస్ ఎక్స్‌పీ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తగులుకున్న ఈ భీకర వైరస్ దెబ్బకు 75 దేశాల్లోని నెట్‌వర్క్‌లు కుప్పగూలిన సందర్భంగా విండోస్ కొత్త అప్‌డేట్‌ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను మూసేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. కంప్యూటర్‌లోకి ర్యాన్‌సమ్‌ వేర్‌ను చొప్పించి డేటాను చోరి చేసి బిట్‌ కాయిన్ల రూపంలో డాలర్లను.. వాన్నా క్రై డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.
 
ఇప్పుడు జరిగిన నష్టం చాలదన్నట్లుగా సోమవారం రెండో సారి వాన్నా క్రై హ్యాకింగ్‌కు పాల్పడతుందనే వార్తలతో వణుకుతున్న ప్రపంచదేశాలు అప్రమత్తమవుతున్నాయి.వాన్నా క్రై బాధితుల్లో ఎక్కువ మంది వినియోగించేది విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం. భారత్‌లో దాదాపు 90 శాతం మంది విండోస్‌ మీదే ఆధారపడుతున్నారు. మన దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్‌ సిస్టంతో నడిచేవే. దీంతో రక్షణ చర్యలు చేపట్టిన ఆర్‌బీఐ సెక్యూరిటీ అప్‌డేట్ వచ్చే వరకూ ఏటీఎంలను తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై లక్ష్యం ఏటీఎంల నుంచి ప్రజల డబ్బును దొంగిలించడం కాదని.. నెట్‌వర్క్‌లలో సమాచారాన్ని లాక్‌ చేసి డబ్బును డిమాండ్‌ చేస్తుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు.
 
ఒకవేళ వాన్నా క్రై ఏటీఎంల నెట్‌వర్క్‌లను హ్యాక్‌ చేస్తే.. వినియోగదారులు ఎలాంటి లావాదేవీలు జరపలేరని వివరించారు. అయితే, ఇప్పటికే రెండు దక్షిణాది బ్యాంకుల కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే పుకార్లు కూడా వస్తున్నాయి. ఆర్‌బీఐ దీని మీద ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
 
దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్‌ సిస్టంకు కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసేంతవరకు ఏటీఎంలు పూర్తిగా పనిచేయవు. పాతికేళ్ల క్రితం ఉద్యోగుల తొలగింపు లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కంప్యూటరీకరణ దుష్ఫలితాలను ప్రపంచం ఇలా అనుభవించాల్సిందే మరి.
 Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇక ఎమ్మెల్యేలు.. ఎంపీలకు చంద్రబాబు పదవులు ఇవ్వనన్నారు... ఎంపీ మురళీమోహన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ గిరిపై టీడీపీ ఎంపీ, సినీ నటుడు కె.మురళీమోహన్ ...

news

జగన్‌ని అందుకే లొంగదీసారు.. తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్

ఒక ఆర్థిక ఉగ్రవాదికి ప్రధాని ఎలా అప్పాయింట్మెంట్ ఇస్తారంటూ మోదీ-వైఎస్ జగన్ భేటీపై ...

news

మంచి భోజనం అందించడమే కాదు.. సినిమాలు కూడా చూపిస్తారట.. వామ్మో.. మన రైళ్లకు ఏమైంది..

ప్రయాణీకుల సౌకర్యానికి నూటికి నూరు శాతం హామీపడతామని చెబుతున్న రైల్వే వ్యవస్థ ఇప్పటికే ...

news

నాలుగు రూపాయలకే పేదలకు ఫుల్ మీల్స్ అట... కనీసం ఆ సహాయమైనా చేయండి

పేదలకు, నిరుపేదలకు బతుకు అవకాశాలు అందించే కర్తవ్యాన్ని పాలకులు, పాలక పక్షాలూ ఏనాడో ...