Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సోషల్ మీడియాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు... సపోర్ట్ పన్నీర్ అంటూ ట్వీట్లు...

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (12:20 IST)

Widgets Magazine
mla list

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పన్నీర్ సెల్వంకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా.. అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఐటీ విభాగం ఆయనకు అండగా నిలిచింది. ఈ విభాగంలో కీలకమైన హరి ప్రభాకరన్, శ్రీరామ్ తదితరులు కలిసి గుట్టుచప్పుడు కాకుండా ఎమ్మెల్యేలందరి ఫోన్ నంబర్ల జాబితాను ట్విట్టర్ ఖాతాలో పెట్టి, పన్నీర్‌కు మద్దతు పలకాలని కోరే వారంతా, ఈ నంబర్లకు మెసేజ్‌లు చేయాలని కోరగా, మెసేజ్‌లు, ట్వీట్లు హోరెత్తిపోతున్నాయి. 
 
ఐటీ విభాగం షేర్ చేసిన ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లను వేలాది మంది రీట్వీట్ చేసుకున్నారు. బుధవారం శశికళ సమావేశానికి వెళ్లి, ఆపై మాయమైన 26 మంది ఎమ్మెల్యేలు పన్నీర్‌కు మద్దతుగా ఉన్నారని ఈ ట్వీట్లలో కనిపిస్తోంది. మిగిలిన వాళ్లు పన్నీర్‌కు మద్దతుగా ఉంటేనే ప్రజామోదం లభిస్తుందని, లేకుంటే పరాభవం తప్పదని హెచ్చరిస్తున్నారు కూడా.
mla list
 
ఈ పరిణామాలతో ఖంగుతిన్న శశికళ వర్గం, ఐటీ విభాగం సిబ్బందిపై కన్నెర్ర జేసింది. అయితే వారిపై చర్య తీసుకోవడం మరింత వ్యతిరేకతకు దారిస్తుందని భావించిన శశికళ నష్టనివారణ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ.. ఫలితం కనిపించడం లేదు. పెక్కుమంది అన్నాడీఎంకే నేతలతో పాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, సాధారణ ప్రజానీకం పన్నీర్‌కు అండగా నిలుస్తుండటం గమనార్హం. 
 
sriram
మరోవైపు.. ఐటీ విభాగం ట్విట్టర్‌లో పెట్టిన ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు, ట్వీట్లను తొలగించడం అసాధ్యమన్నంత స్థాయిలో షేర్ అయిపోయాయి. ఇది ప్రజలకు, శశికళకు మధ్య జరుగుతున్న యుద్ధమని, పన్నీర్‌కు మద్దతివ్వాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై శాంతియుత ఒత్తిడి తేవాలని తన ట్వీట్‌లో శ్రీరామ్ కోరారు. దీంతో ఆయనను ఆ విధుల నుంచి శశికళ తొలగించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీర్ సెల్వం దూకుడు.. పోలీస్ కమిషనర్ బదిలీ.. పార్టీ ఖాతాల్లో డబ్బు తీస్తే తాటతీస్తా..!

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం పరిపాలన పరంగా జోరు పెంచారు. ఇన్నాళ్లు ...

news

ట్రంప్ కుమార్తె ఇవాంక బ్రాండ్ ఉత్పత్తుల్ని విక్రయించేది లేదు: నార్డ్‌స్ట్రూమ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఆయన కుమార్తెకు నార్డ్‌స్ట్రూమ్ సూపర్ ...

news

క్లైమాక్స్‌కు తమిళనాడు ఆధిపత్య పోరు... చెన్నైకు రానున్న గవర్నర్ విద్యాసాగర్ రావు

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరు క్లైమాక్స్‌కు చేరింది. తమిళనాడులో ...

news

తమిళనాట పెరిగిన ఉత్కంఠ... అజ్ఞాతంలో 40 మంది ఎమ్మెల్యేలు?

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠత తారా స్థాయిలో నెలకొంది. అన్నాడీఎంకే చెందిన 40 మంది ...

Widgets Magazine