శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 మే 2016 (14:56 IST)

వచ్చే యేడాది విద్యార్థులు నీట్ పరీక్ష రాయాల్సిందే : ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా

జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి విద్యార్థులకు ఈ యేడాది మాత్రమే ఉపశమనం లభిస్తుందని, వచ్చే యేడాది తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. నీట్‌పై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. నీట్ ఆర్డినెన్స్‌పై స్పష్టత రావడంతో రాష్ట్రాలు స్వంతంగా ప్రవేశ పరీక్షలను నిర్వహించుకుని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలను చేసుకోడానికి మార్గం సుగమమైంది.
 
ఈ పరిస్థితుల్లో నీట్‌పై మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ... నీట్‌ను పరిగణనలోకి తీసుకుంటాయా? లేదా అనేది రాష్ట్రాల ఇష్టమన్నారు. జులై 24న రెండో దశ నీట్ పరీక్ష జరుగుతుందన్నారు. 2017-18 నాటికి నీట్ నిర్వహణపై చట్టం తీసుకువస్తామన్నారు. నీట్‌కు యేడాది పాటు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రాలు కోరాయన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గంలో ఈ అంశంపై విపులంగా చర్చించి ప్రత్యేక ఆర్డినెన్స్‌ను రూపొందించామని వివరించారు.