Widgets Magazine

బీహార్‌లో అబ్బాయిల్ని కిడ్నాప్ చేసి... అలా చేస్తున్నారు?

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (08:57 IST)

minor girl marriage

బీహార్‌లో అబ్బాయిల కిడ్నాప్ ఉదంతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. 18 ఏళ్లకు పైబడిన అబ్బాయిలను కిడ్నాప్ చేయడంలో దేశంలో బీహారే నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. వరకట్నం ఇబ్బందుల వల్ల పెళ్లి కుమార్తె తరపు వారు అబ్బాయిని కిడ్నాప్ చేసి.. తలకు గన్ను గురిపెట్టి... అమ్మాయి మెడలో తాళి కట్టేలా చేస్తున్నారు.

అబ్బాయికి ఇష్టం ఉన్నా లేకున్నా.. బెదిరింపులకు పాల్పడి.. అమ్మాయిలతో పెళ్లి చేయిస్తున్నారు. ఇలాంటి వివాహాలు 2017 దాదాపు 3,400 జరిగాయని బీహార్ పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో ''పకడ్వా వివాహ్'' అనే సంస్కృతికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. పకడ్వా వివాహ్ అంటే వరుడికి ఇష్టం వున్నా లేకున్నా బలవంతపు వివాహం చేసే పద్ధతి. వరకట్నం ఇబ్బందుల కారణంగా పెళ్లి కుమార్తె తరపు బంధువులు, కుటుంబీకులు అబ్బాయిని అపహరించి.. పెళ్లి కుమార్తెతో వివాహం జరిపిస్తారు. 
 
ఈ కల్చర్ పెచ్చరిల్లిపోవడంతో ఇలాంటి వివాహాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు సూచించామని ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. బీహార్‌లో రోజుకు సగటున తొమ్మిది బలవంతపు వివాహాలు జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రైలు జనరల్ బోగీలో స్టౌవ్‌లో కోట్ల రూపాయల విలువ చేసే బంగారం... నెల్లూరులో....

నెల్లూరు జిల్లాలోని రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గౌహతి ...

news

పనిమనిషిలా చేరుతుంది... యజమానులను పెళ్ళిచేసుకుంటుంది.. ఆ తరువాత?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త ...

news

కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏంటది?

‘‘ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపలేదు. అయినా మన సమర్థత ...

news

శ్రీకాళహస్తిలో 'శివగామి'.. అక్కడ ఆమె మాటే శాసనం... ఎవరో తెలుసా?

ఆ అధికారి రూటే సపరేటు. అక్కడ ఆమె చెప్పిందే వేదం. ఆమె మాట వినకపోతే అంతేసంగతులు. ...

Widgets Magazine