శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (11:13 IST)

దేశంలో 34,600 రేప్‌లు.. తెలిసినవారే రేపిస్టులు.. అత్యాచారాల్లో మధ్యప్రదేశ్ టాప్

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కూడా మహిళలపై లైంగిక దాడులు ఏమాత్రం తగ్గట్లేదు మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం ర

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత కూడా మహిళలపై లైంగిక దాడులు ఏమాత్రం తగ్గట్లేదు మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వం రేపిస్టులకు కఠిన శిక్షలు వేసే దిశగా చట్టాల్లో సవరణ చేయట్లేదు. గత ఏడాది దేశంలో మహిళలపై 34,600 కేసులు నమోదైనాయని జాతీయ నేరాల రికార్డుల బ్యూరో తాజాగా విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. 
 
ఈ డేటాలో దేశంలోనే మధ్యప్రదేశ్, ఢిల్లీలలో అత్యాచారాల ఘటనలు ఎక్కువగా జరిగాయని తేలింది. 2015వ సంవత్సరంలో జరిగిన 33,098 అత్యాచారం కేసుల్లో నిందితులు బాధితురాళ్లకు బాగా తెలిసిన వారే కావడం గమనార్హం. అత్యాచార బాధితుల వయసు ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఉండగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది 4,391 అత్యాచారం కేసులతో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో 2,199 కేసులతో కేంద్రపాలిత ప్రాంతాల్లోకెల్లా ముందుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై 15,931 కేసులు నమోదైనాయి.