శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 28 నవంబరు 2016 (13:02 IST)

నేనే కేంద్ర ఆర్థిక మంత్రిని అయితే మోదీతో నీళ్లు తాగించేవాడిని... పి. చిదంబరం

ఆర్థిక మంత్రి అంటే పి. చిదంబరం... చిదంబరం అంటే ఆర్థికమంత్రి అనేంతగా జనంలో తన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాయకుడు పి. చిదంబరం. యూపీఎ అధికారంలో ఉండగా పి. చిదంబరం ఆర్థికమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఐతే ఇప్పుడు సడన్‌గా ఆయన పెద్దనోట్ల రద్దు గురించి

ఆర్థిక మంత్రి అంటే పి. చిదంబరం... చిదంబరం అంటే ఆర్థికమంత్రి అనేంతగా జనంలో తన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నాయకుడు పి. చిదంబరం. యూపీఎ అధికారంలో ఉండగా పి. చిదంబరం ఆర్థికమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఐతే ఇప్పుడు సడన్‌గా ఆయన పెద్దనోట్ల రద్దు గురించి ఎక్కడా చూసిన చర్చల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన పెద్ద నోట్ల రద్దుపై మాట్లాడుతూ... తనే కనుక కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉంటే ప్రధానమంత్రికి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సలహా ఇచ్చేవాడినని సెలవిచ్చారు. ఒక రకంగా పదవికి రాజీనామా చేయడం ద్వారా మోదీతో నీళ్లు తాగించేవారన్నమాట.
 
ఒకవేళ మోదీ తన మాట వినకుండా బలవంతంగా నోట్ల రద్దు చేయాలని అంటే, తన పదవికి రాజీనామా చేసి ఉండేవాడనని అన్నారు. ఎందుకంటే నోట్ల రద్దు అనేది సామాన్యమైన విషయం కాదనీ, 45 కోట్లమందికి నిత్యావసర వస్తువులను దూరం చేసినట్లయిందనీ, అది చాలా అనైతిక చర్య అంటూ దుయ్యబట్టారు. రాజకీయ నాయకులు అంతేలే... పదవి ఉంటే రాజీనామా చేయరు... పదవి లేకపోతే రాజీనామా చేస్తానంటారు... అంతేమరి.